డస్ట్ బిన్ 'బెస్ట్ బిన్' అవ్వాలి

ఇంటి అందం పెంచే వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయా అని వెదికే వాళ్ళ కోసం... ఈ సమాచారం... ఇంట్లోని చెత్తని బయట పడేసే వరకు దానిని అందంగా ఎలా స్టోర్ చేయచ్చో తెలుసా... మాములు బుట్టల నుంచి రంగు రంగుల డస్ట్ బిన్స్ వరకు ఎన్నో చూసారు కదా... ఇప్పుడు పిల్లల రూమ్ కోసం వాళ్ళు ఇష్టపడే రంగులలో, డిజైన్స్ లో ఎన్నో వెరైటీ డస్ట్ బిన్ లు మార్కెట్ లో వున్నాయి. అలాగే లివింగ్ రూమ్ కోసం కాస్త హుందాగా ఉండేవి, డైనింగ్ రూమ్ కోసం ఆకర్ష్యనీయం గా ఉండేవి...ఇలా మన అవసరాలు, ఇష్టాలు బట్టి చెత్త వేసే డబ్బాలని  ఎంచుకుని కొనుక్కోవచ్చు... ఖరీదయిన ఫర్నిచర్ , అందమయిన ఇంటీరియర్, కళ్ళు చెదిరే డెకరేషన్... వీటికి ఎక్కడా తగ్గకుండా ఓ డస్ట్ బిన్ కూడా చేరితే... ఇంకేం వుంది చెప్పండి... మీ ఇల్లు అందంగా మెరిసిపోతుంది.

పిల్లలకోసం


-రమ