మళ్లీ అదే తప్పు చేస్తున్న జూనియర్
on Sep 29, 2015
యంగ్ టైగర్ తారక్ ట్రాకే కాదు... థాట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరికో దక్కిన సక్సెస్ ను చూసి తనకు సొంతమవ్వాలని వెంటపడతాడు, ఆ తర్వాత భంగపడతాడు. కిక్ చూసి సురేందర్ రెడ్డితో కమిటై...ఊసరవెల్లి చేశాడు. సింహా సినిమా చూసి బోయపాటితో ‘దమ్ము‘ చూపించాలని చూశాడు, దూకుడు‘ చూసి బాద్షాగా మారాడు. చివరికి గబ్బర్ సింగ్ తిక్కచూసి ‘రామయ్యా వస్తావయ్యా‘ అంటూ బోల్తాకొట్టాడు.
దాంతో బుద్ధితెచ్చుకున్న జూనియర్... సుకుమార్ లాస్ట్ ఫిల్మ్ ఫ్లాపైనా లెక్కచేయకుండా సినిమా కమిటై....నాన్నకు ప్రేమతో అంటూ రావడానికి సిద్ధమయ్యాడు, గతంలోలాగా సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ వెంటపడి చేతులు కాల్చుకోకుండా ఈసారి జాగ్రత్తపడ్డాడు అనుకునేలోపే, మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు, శ్రీమంతుడు సినిమాతో ద్వితీయ విఘ్నం దాటిన కొరటాల శివతో నెక్ట్స్ ఫిల్మ్ కమిట్ అవడంతో తారక్ అభిమానుల్లో మరోసారి టెన్షన్ మొదలైంది.
సక్సెస్ కొట్టిన దర్శకుడితో సినిమా చేసి ఫెయిల్ అవుతాడని పేరున్న తారక్ కు... కొరటాలతోనూ అదే అనుభవం ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసి, కొరటాల శివతో కలిసి తారక్ ఇండస్ట్రీ హిట్ కొడతాడేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
