హమ్మయ్య ..రుద్రమదేవి కష్టాలు తీరాయ్
on Sep 29, 2015
ఎట్టకేలకు రుద్రమదేవి సమస్యలకు తెరపడింది. రుద్రమదేవి వాయిదా పడిందనే మాట ఇక వినపడదు. ఏపీ ఫిలింఛాంబర్ లో పంపిణీదారులందరితో గుణశేఖర్ జరిపిన సమావేశం సక్సెస్ అయింది. ఈ మీటింగ్ లో రుద్రమదేవిని రిలీజ్ చేసేందుకు ఫైనాన్సియర్స్ క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో అక్టోబర్ 9 గ్రాండ్ రిలీజ్ కి సిద్దమవుతోంది రుద్రమదేవి. అయితే ఈసినిమాను గుణశేఖర్ కొన్ని కోట్ల డెఫిసిట్ తో రిలీజ్ చేయబోతున్నారు.
రుద్రమదేవి విజయంపైన గుణశేఖర్ చాలా ధీమాతో వున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించి తన కష్టాలను దూరం చేస్తుందని నమ్ముతున్నాడు. మరోవైపు హిందీ లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం లేదు. అభిషేక్ పిక్చర్స్- రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రిలీజ్ ఆగిపోయింది. తెలుగులో హిట్టైయ్యక బాలీవుడ్ రిలీజ్ చేయాలని గుణశేఖర్ భావిస్తున్నాడట.