'శ్రీమంతుడు' లిస్ట్ లో చేరిన యంగ్ టైగర్
on Sep 29, 2015
శ్రీమంతుడు సినిమా కోట్ల కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. ఇంటా బైటా ఈ సినిమా గురించే చర్చ. మహేష్ ఆడి ఎ6 లగ్జరీ కార్‌ని కానుకగా ఇచ్చి కొరటాల శివను ఖుషీ చేసేశాడు. అయితే శ్రీమంతుడు హవా అక్కడితో ఆగలేదు. ఈ సినిమాని బాలీవుడ్‌లో కండల హీరో సల్మాన్‌ఖాన్ రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని వార్తలొచ్చాయి.
ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు ప్రతి ఒక్కరికీ నచ్చుతోంది. ఈ సినిమాని ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ వంటివారే ప్రశంసించారు.ఇప్పుడు ఈ సినిమాని చూసి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఫ్లాట్ అయిపోయాడట. రాసుకున్న స్క్రిప్ట్ కి తెరకెక్కించిన తీరుకి తాను స్పెల్ బౌండ్ అయిపోయినట్టు తెలిపాడు. ఇంత మంచి చిత్రంలో నటించినందుకు మహేష్ కి తారక్ ప్రత్యేకంగా కృతఙ్ఞతలు సైతం తెలిపాడట. అంతేకాక తన ప్రస్తుత సినిమా నాన్నకు ప్రేమతో షూటింగ్ విశేషాల గురించి కూడా చాలా సేపు ముచ్చటించుకున్నట్టు సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
