సూపర్ స్టార్స్ పై సంపూర్ణేష్ కామెంట్స్!
on Jul 27, 2016
హీరోకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం లేని ఏకైక హీరోగా తెలుగులో పరిచయమై అదోరకం కామెడీతో ప్రేక్షకులను అలరించి తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ. ఆ తర్వాత మనోడి యాక్టింగ్ జనాలకు కూడా బోర్ కొట్టేసి బాబుని పక్కనపెట్టేశారనుకోండి. అయితే బాబు మాత్రం ఎప్పటికప్పుడు జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు.
మొన్నామధ్య అమెరికాలో ఆటా నిర్వాహకులు తనను అమ్మ/ఆళి బూతులు తిట్టారని ట్విట్టర్ లో చెప్పుకొని మరీ బాధపడిన సంపూ మళ్ళీ అదే ట్విట్టర్ సాక్షిగా తెలుగు స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ లనే టార్గెట్ చేశాడు. వరుసగా "సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కబాలి" చిత్రాలు నిరాశపరచడంతో.. ఎవడో సంపూ అభిమాని కనీసం సంపూ అయినా తమని కాపాడాలని ఒక డిఫరెంట్ స్టైల్ లో మెసేజ్ పెట్టాడు. దాన్ని సంపూ షేర్ చేసి "సరదాకి" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రజనీకాంత్ అభిమానులందరూ ఒక్కసారిగా సంపూపై విరుచుకుపడ్డారు!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
