కథలు రాస్తానంటోన్న హీరోయిన్!
on Jul 27, 2016
హీరోయిన్ గా కాస్త గుర్తింపు రావడమే తరువాయి వరుసగా సినిమాలు, మధ్యలో షాపింగ్ మాల్స్ ఓపెనింగులు, మోడలింగ్ చేసేస్తూ రెండు చేతులారా సంపాదిస్తూ ఫారిన్ ట్రిప్పులని, ఫ్యామిలీ ట్రిప్పులని తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు. కానీ.. ఈమధ్యనే సినిమాల్లో కాస్త గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన స్వర భాస్కర మాత్రం నటనపై దృష్టి సారించకుండా ఒక ప్రేమకథ రాస్తోందట.
ఓ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ మధ్య పుట్టిన స్వచ్చమైన ప్రేమను కథగా వ్రాస్తోందట. ఈ కథను సినిమాగా రూపొందించాలన్నది స్వరభాస్కర్ అభీష్టం. అయితే.. ఆ సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచన మాత్రం లేదట కానీ, కుదిరితే ఏదైనా ఒక కీలకపాత్ర మాత్రం పోషిస్తానంటోంది.
ఇకపోతే.. ఇటీవల "నీల్ బట్టే సన్నాట" చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న స్వరభాస్కర ప్రస్తుతం "వీర్ ది షాదీ" చిత్రంలో పోషించబోయే పాత్ర కోసం బరువు తగ్గే పనిలో ఉంది. ఈ సినిమా అనంతరం తాను రాసుకొన్న కథను వెండితెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలెడుతుంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
