రకుల్ కోసం "ఒకడొచ్చాడు"
on Jul 27, 2016
విశాల్ కథానాయకుడిగా విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర పోషించనుండగా.. ఓ యువ తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విశాల్ ఈ చిత్రంలో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ గా నటించనుండగా.. జగబతిబాబు సి.ఐ.డి పాత్ర పోషించనున్నాడు. తమిళంలో ఈ చిత్రానికి "డిటెక్టివ్" అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టగా.. తెలుగు అనువాదరూపానికి "ఒకడొచ్చాడు" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
విశాల్ గత చిత్రం "రాయుడు" తమిళనాట మంచి హిట్ సాధించినప్పటికీ.. తెలుగువారు మాత్రం ఆ ఘాటు తమిళ వాసనను భరించలేకపోయారు. దాంతో తాజా చిత్రం తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించనున్నారట. రకుల్ కాకుండా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉండడంతో.. ప్రస్తుతం ఆ సెకండ్ హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
