'సైజ్ జీరో' లో రెచ్చిపోయిన ప్రకాష్
on Nov 25, 2015
మంచి పాత్ర పడితే ప్రకాష్ రాజ్ ఎలా చెలరేగిపోతాడో మనం ఎన్నో సినిమాల్లో చూశాం. గత కొంత కాలంగా ప్రకాష్ కి సరైన సినిమాలు కానీ పాత్రలు కానీ రావడం లేదు. దీంతో అతని క్యారెక్టర్లు ఎంతో బోర్ కొట్టించేస్తున్నాయి. అయితే చాలా రోజులు తరువాత మళ్ళీ ప్రకాష్ రాజ్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడట. 'సైజ్ జీరో' సినిమాలో శాడిస్ట్ విలన్ గా అభిమానులను అలరించాబోతున్నాడట. ముఖ్యంగా చెప్పాలంటే 'సైజ్ జీరో' లో ప్రకాష్ పాత్ర మెయిన్ హైలైట్ గా నిలవబోతు౦దట. ఈ సినిమాలో ప్రకాష్ మెడికల్ మాఫియా నడుపుతుంటాడట. ఈ పాత్ర చాలా టిపికల్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి 'సైజ్ జీరో'తో ప్రకాష్ మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం!!