ముంబైలో మహేష్ కి ఫ్లాట్ ఎందుకో?
on Nov 25, 2015
సూపర్ స్టార్ మహేష్ బాబు కన్ను ముంబై మీద పడింది. అంతే వెంటనే అక్కడ ఓ పాతిక కోట్లు పెట్టి ఓ ఫ్లాట్ కొనేశాడు. సల్మాన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి నిర్మించిన వెంచర్స్ లో మహేష్ ఈ ఇల్లు కొనుక్కోవడం విశేషమని బాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఖరీదైన నివాసాన్ని నిర్మించుకున్న ప్రిన్స్ దాని కోసం భారీగానే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ముంబై లో ఫ్లాట్ కి కూడా అదే రెంజులో ఖర్చు పెడుతున్నారట. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ పనిలో నమ్రత బిజీగా వుందట. తమ అభిరుచికి తగ్గట్టే ఓ రేంజులో ఇంటీరియర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే బాలీవుడ్ పై మోజు లేదని చెప్పిన మహేష్ సడన్ ఖరీదైన ఫ్లాట్ కొనడం వెనక అసలు కారణం ఏమిటి అన్న చర్చ సాగుతోంది టాలీవుడ్ లో?