శ్రీకాంత్‌కి ఘోర అవమానం
on Nov 30, 2015
వంద సినిమాల హీరో శ్రీకాంత్.. పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు పొందాడు. తన పని తనదే.. తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోడు. అయితే అలాంటి హీరోకి అవమానం ఎదురైంది. అదీ హీరోయిన్ల చేతిలో. శ్రీకాంత్ సినిమా అంటే ఏ హీరోయినూ... సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదట. శ్రీకాంత్ అయితే మేం చేయం.. అనేస్తున్నార్ట. కేవలం హీరోయిన్లు దొరక్కపోవడం వల్లే కొన్ని సినిమాల్ని శ్రీకాంత్ వదులుకోవాల్సివచ్చిందట. ఈ విషయాన్ని శ్రీకాంత్ స్వయంగా చెప్పుకొచ్చాడు.
ఇప్పటి హీరోయిన్లు పెద్దగా సహకరించడం లేదని, వాళ్ల దృష్టి వేరే విషయాలపై పడిందని, అందుకని తనబోటి వాళ్లతో సినిమాలు చేయడానికి ముందుకు రావట్లేదని ఈ తరం హీరోయిన్లపై సంచలనవ్యాఖ్యలు చేశాడు శ్రీకాంత్. అప్పట్లో కథానాయికలు కథ నచ్చితే ఎంత చిన్న హీరో అయినా నటించడానికి ఓకే చెప్పేవారని, ఇప్పట్లో ఆ వాతావరణం లేదని, పెద్ద హీరోయిన్లు దొరక్క, కొత్త కథానాయికలతో సినిమాలు చేయలేక సినిమాలు ఆగిపోతున్నాయని, ఈ విషయంలో హీరోయిన్లు పెద్ద మనసు చేసుకోవాలని అంటున్నాడు శ్రీకాంత్. మరి ఇప్పటి హీరోయిన్లకు ఈ విషయం చెవికెక్కుతుందా??
Also Read