అల్లు అరవింద్‌కి దెబ్బేశాడు
on Nov 28, 2015
టాలీవుడ్‌లో మరో హీరో వస్తున్నాడు.. అయితే ఇతనేం అల్లాటప్పా హీరో కాదు.. తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన మొనగాడు. అతనే.. దేవిశ్రీ ప్రసాద్. ఇతగాడు హీరో ఎప్పుడెప్పుడు అవుతాడా అంటూ టాలీవుడ్ అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఎందుకంటే హీరో అవ్వదగిన లక్షణాలన్నీ దేవిశ్రీలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే చాలామంది నిర్మాతలు, దర్శకులు దేవిశ్రీ వెంట పడ్డారు. చివరికి దిల్‌రాజు - సుకుమార్ చేతికి చిక్కాడు దేవిశ్రీ.
సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఈ ముగ్గురూ మంచి దోస్త్‌లు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడంలో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.అయితే ఈ కాంబినేషన్ మాత్రం అల్లు అరవింద్‌కి జీర్ణం కావడం లేదు. ఎందుకంటే దిల్ రాజు ప్లేసులో ఉండాల్సిన నిర్మాత ఆయనే. దేవిశ్రీ ని హీరోగా చేయడానికి అల్లు అరవింద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. 100%లవ్ కథ ముందు దేవిశ్రీకే వినిపించారు. `నేను హీరోని అయితే మీ బ్యానర్‌లోనే అవుతా` అంటూ అల్లు అరవింద్ కూడా దేవిశ్రీ దగ్గర మాట తీసుకొన్నారు. దాంతో ఆయన కూడా రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు దిల్‌రాజు - దేవిశ్రీ కలని అల్లు అరవింద్‌కి షాకిచ్చారు. మొదటి సినిమా దిల్‌రాజుకి ఫిక్సయిపోతే.. ఆ ఛాన్స్ అల్లు కి పోయినట్టే కదా.
దేవిశ్రీ తొలి సినిమా అంటే ఉన్న క్రేజ్ రెండో సినిమాపై ఉండదు.అలాంటప్పుడు రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయడానికి అల్లు కూడా ససేమీరా అంటాడు. చూస్తూండండి. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టులోకి అల్లు అరవింద్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తాడు అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఎందుకంటే ఆయన మాస్టర్ ప్లాన్ సినీ జనాలకు తెలియంది కాదు. మరి అరవింద్.. ఎలాంటి ప్లాన్ తో ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తాడో చూడాలి!