నానీని మణిరత్నం పక్కనబెట్టేశాడట!!
on Oct 27, 2015
మణిరత్నం ఓకే బంగారం కంటే ముందు నాగార్జున, మహేష్ బాబులతో ఓ మల్టీస్టారర్ అనుకుని దాన్ని పక్కనబెట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు ఇలాగే మెటీరియలైజ్ కాకుండా చెత్త బుట్టలోకి వెళ్లిపోయిందని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కు మణిరత్నం సన్నాహాలు చేయడం.. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ స్థానంలో నాని రావడం.. ఇందులో హీరోయిన్ గా ఎంపికైన కీర్తి సురేష్ డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకోవడం.. ఈ పరిణామాలన్నీ తెలిసినవే. ఐతే తాజా కబురేంటంటే.. ఈ సినిమాను మణిరత్నం పక్కనబెట్టేశాడట. కారణాలేంటన్నది తెలియలేదు కానీ.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు ఫుల్ స్టాప్ పెట్టేసి.. ధనుష్ తో ఇంతకుముందు అనుకున్న సినిమాను మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.