కొరటాల కొట్టి చెప్పాడు!!
on Oct 26, 2015
టాలీవుడ్ దర్శకులంతా కొత్త ట్రెండ్ ను సెట్ చేసుకుంటున్నారు. ఇదివరకటి లాగా రోజుల తరబడి సినిమాలు చేయడ౦ లేదు. సినిమా ఓపెనింగ్ అయిన దగ్గర నుంచే పక్క ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. ఇలా చేయడం ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని కూడా తగ్గిస్తున్నారు. శ్రీను వైట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ ని చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యగా..లేటెస్ట్ గా కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే రిలీజ్ డేట్ ని ప్రకటించేశాడు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని ఆగస్టు 12న కృష్ణా పుష్కరాల సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు కొరటాల ప్రకటించాడు. ఇదే విధంగా టాలీవుడ్ దర్శకులంతా పక్క ప్రణాళికతో ముందుకు వెళితే ఇండస్ట్రీకి ఎంతో మంచిదని సినీ వర్గాల అభిప్రాయం.