రుద్రమదేవి తో రాజుగారికి లాభాలే లాభాలు!!
on Oct 27, 2015
రుద్రమదేవి నైజాంలో అదిరిపోయే కలెక్షన్లు సాధించి విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. బ్రూస్ లీ సినిమా వల్ల రుద్రమదేవి కలెక్షన్లు భారీగా దెబ్బతింటాయని అనుకున్న ట్రేడ్ వర్గాలను అంచనాలను తిప్పికొట్టింది. అందరూ అనుకున్నట్లు ‘బ్రూస్ లీ’ వల్ల ‘రుద్రమదేవి’ దెబ్బతినలేదు. ‘రుద్రమదేవి’ వల్లే ‘బ్రూస్ లీ’కి బ్యాండ్ పడింది.ముఖ్యంగా నైజాం ఏరియాలో బ్రూస్ లీ సినిమాకు రుద్రమదేవి పంచ్ మామూలుగా లేదు. రెండో వారం కూడా ‘రుద్రమదేవి’ నైజాంలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తే.. బ్రూస్ లీ ఫస్ట్ వీకెండ్లోనే అక్కడ డల్లయిపోయింది.
మూడో వీకెండ్ ముగిసేసరికి నైజాంలో రుద్రమదేవి రూ.20.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. పన్ను మినహాయింపు వల్ల ఇక్కడ షేర్ కూడా బాగానే వచ్చింది. రూ.14.24 కోట్ల షేర్ నేరుగా డిస్ట్రిబ్యూటర్ ఖాతాలోకి వెళ్లిందది. దిల్ రాజు ఈ సినిమాను రూ.12 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. అంటే ఇప్పటికే నైజాంలో రూ.2.24 కోట్ల లాభం వచ్చిందన్నమాట. మొత్తానికి దిల్ రాజు రుద్రమదేవి మీద పెట్టిన నమ్మకం నిలబడింది.