మెగా క్యాంపుకు వాళ్లెందుకు నచ్చుతున్నారబ్బా..!
on May 27, 2016
మామూలుగా ఫ్లాప్ తీసిన డైరెక్టర్ కు మళ్లీ అవకాశం రావడమంటే కష్టమే. కానీ అదేం విచిత్రమో కానీ, మహేష్ తో ఫ్లాప్ తీసిన దర్శకులకు వెంటనే సినిమా అవకాశాలొస్తున్నాయి. అది కూడా కేవలం మెగాక్యాంప్ లోనే రావడం విచిత్రం. అసలు మహేష్ ఫ్లాప్ సినిమాల డైరెక్టర్స్ వీళ్లకెందుకు నచ్చుతున్నారన్నది అర్ధం కాని విషయం. మహేష్ తో ఖలేజా తీసి ఫ్లాప్ కొట్టిన త్రివిక్రమ్ తో వెంటనే అల్లు అర్జున్ జులాయి చేశాడు. ఆగడు లాంటి భారీ డిజాస్టర్ ను తీసిన శ్రీను వైట్లను పిలిచి బ్రూస్ లీ చేతిలో పెట్టాడు చెర్రీ. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ మిస్టర్ కు కూడా ఆయనకే అవకాశం వచ్చింది. ఇక 1 నేనొక్కడినే అన్న సినిమాతో మహేష్ కు ఫ్లాప్ ఇచ్చిన సుకుమార్ ను చెర్రీతో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం బుక్ చేసుకున్నారు మెగాక్యాంప్. లేటెస్ట్ గా బ్రహ్మోత్సవంతో బోల్తా కొట్టిన శ్రీకాంత్ అడ్డాలకు సాయి ధరమ్ తో ఒక ఫ్యామిలీ సినిమా కోసం చర్చలు జరుపుతున్నారట. మెగా క్యాంప్ కు, మహేష్ ఫ్లాప్ డైరెక్టర్లకు మధ్య ఈ కెమిస్ట్రీ ఏంటబ్బా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.