పవన్ ఫుల్ క్లారిటీగా ఉన్నాడు బాస్...!
on May 27, 2016
పవన్ కళ్యాణ్ క్రేజ్ కు మాస్ క్లాస్ అంటూ తేడా లేదు. అందరికీ పవన్ సినిమా అంటే ఆసక్తే. అయితే పవన్ మాత్రం వీలైనంత సైలెంట్ గానే ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో అన్నది కూడా రహస్యమే. ఆయన సినిమా పట్టాలెక్కే వరకూ అందరివీ ఊహాగానాలే. అయితే తొలిసారి పవన్ తన తర్వాతి మూడు ప్రాజెక్ట్స్ ను ముందుగా ప్లాన్ చేసేశాడు. 2019 లో పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ముందుగానే సినిమాల్ని లైనప్ చేసేశాడు. ఇలా లైన్ గా మూడు సినిమాలు ప్లాన్ చేసి ఉంచడం, పవన్ కెరీర్లోనే ఫస్ట్ టైం అంటున్నారు సినీజనాలు. ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఫాక్షనిస్ట్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత దాసరికి ఇచ్చిన మాట ప్రకారం, ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వేదాళం సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేయనున్నాడు పవన్. గతంలో భారీ సినిమాలు నిర్మించిన నిర్మాత ఎ.ఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారట. ఇలా ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ ను ఓకే చేసి ఫుల్ జోష్ మీదున్నాడు పవన్. సరిగ్గా గమనిస్తే, ఈ ముగ్గురు దర్శకులు తనకు కెరీర్లో మరిచిపోలేని హిట్స్ ఇచ్చిన వాళ్లే. సూర్య తో ఖుషీ, త్రివిక్రమ్ తో అత్తారింటికి దారేది, హరీష్ శంకర్ తో గబ్బర్ సింగ్..ఈ మూడు సినిమాలూ పవన్ కెరీర్ లో మైలురాళ్లు అనే చెప్పాలి. ఇక పవన్ మాటల బట్టి చూస్తే, ఈ ముగ్గురితో చేస్తున్న సినిమాలే ఆయన పాలిటిక్స్ లోకివెళ్లేముందు చేసే చివరి మూడు సినిమాలు కావచ్చు. ఆ తర్వాత పవన్ సినిమాలు చేస్తారా లేదా అన్నది అనుమానమే. అభిమానులైతే పవన్ సినిమాలు మానకూడదని కోరుకుంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
