త్రివిక్రమ్ కు బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ తగులుతోందా..?
on May 27, 2016
సమ్మర్ కు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చి నిరాశ పరిచింది బ్రహ్మోత్సవం. దీంతో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పుకుని వస్తున్న త్రివిక్రమ్ నితిన్ ల సినిమా అ..ఆ ఇబ్బందుల్లో పడింది. మహేష్ సినిమా హిట్టై ఉంటే, అదే జానర్ సినిమా కాబట్టి, ముందే ఫీల్ గుడ్ గా వస్తారు జనాలు. అయితే ఎప్పుడైతే ఆ సినిమా నిరాశ పరిచిందో, ఇప్పుడు అ..ఆ కూడా సీరియల్ లా ఉంటే పరిస్థితి ఏంటి అన్న ఒపీనియన్ ఆడియన్స్ లో ఉంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్లు జోరందుకోకపోవడం, ట్రైలర్ డల్ గా ఉండటంలాంటివన్నీ, మూవీకి భారీ ఓపెనింగ్స్ రాకుండా అడ్డుకుంటాయంటున్నారు విశ్లేషకులు. పైపెచ్చు బ్రహ్మోత్సవంలాగే, అ ఆ కూడా సెకండాఫ్ ల్యాగ్ ఎక్కువ ఉందని సెన్సార్ టాక్ వచ్చింది. దీని బట్టి చూస్తే, అ ఆ సక్సెస్ అవ్వాలంటే సినిమాలో అద్భుతమైన విషయం ఉండాల్సిందే. లేదంటే కష్టమే. అయితే దర్శకుడు త్రివిక్రమ్ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అన్నది వాళ్లకు అనవసరం. ఆయన క్రియేట్ చేసే మ్యాజిక్ కోసమే వీళ్లందరూ మూవీకి వెళ్తారు. కాబట్టి, ఆ విధంగా చూసుకుంటే మాత్రం త్రివిక్రమ్ కొద్దిగా రిలీవ్ అవచ్చు. ఏదేమైనా రొటీన్ కు భిన్నంగా ఉంటేనే ప్రస్తుతం ఆడియన్స్ సినిమాల్ని ఆదరిస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేశాడో తెలియాలంటే, జూన్ 2 వరకూ ఆగాల్సిందే..