కరోనా ఎఫెక్ట్: స్టార్ కమెడియన్ వెడ్డింగ్ రిసెప్షన్ వాయిదా
on Mar 28, 2020
తమిళ స్టార్ కమెడియన్లలో యోగిబాబు ఒకడు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతడు కాస్త పరిచయమే. రజనీకాంత్ రీసెంట్ సినిమా 'దర్బార్'లో రజనీ ఇంట్లో పనిచేసే వ్యక్తిగా నటించాడు. కరోనా ఎఫెక్ట్ ఇతడి మీద కూడా పడింది. ఫిబ్రవరిలో 5వ తేదీన కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో తిరుత్తణి మురుగన్ దేవాలయంలో యోగిబాబు పెళ్లి చేసుకున్నాడు. తమిళ రాజకీయ సినీ ప్రముఖుల కోసం ఏప్రిల్ తొలి వారంలో రిసెప్షన్ ఇవ్వాలని సన్నాహాలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వెడ్డింగ్ రిసెప్షన్ వాయిదా వేసుకున్నాడు.
తన వెడ్డింగ్ రిసెప్షన్ కోసం యోగిబాబు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, రాజకీయ నేత - నటుడు విజయకాంత్ సహా ఇండస్ట్రీలో హేమాహేమీలు అందరికీ రిసెప్షన్‌కు రావలసిందిగా ఇన్విటేషన్లు ఇచ్చాడు. మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించినప్పుడు... ఏప్రిల్ తొలివారంలో రిసెప్షన్‌కు ఎటువంటి ఆటంకాలు రావని, ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పుడు ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చినప్పుడే రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడట.
Also Read