లాక్డౌన్ స్టోరీ: విరాట్ కోహ్లీకి హెయర్ కట్ చేసిన అనుష్క!
on Mar 28, 2020
అవునండోయ్... టీమిండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జుట్టును అనుష్క శర్మ కత్తిరించారు. క్వారంటైన్ టైమ్లో మన సినిమా సెలబ్రెటీలు కొత్త కళలు నేర్చుకుంటున్నారు. కత్రినా కైఫ్ వంటింట్లో గిన్నెలు కడిగారు. ఎప్పుడూ వంట గదిలోకి అడుగు పెట్టని నాని కర్రీ చేశాడు. అనుష్క శర్మ అయితే ఏకంగా బార్బర్ అవతారం ఎత్తారు. ఇంట్లో ఖాళీగా కూర్చున్న తన భర్త విరాట్ కోహ్లీకి హెయిర్ కట్ చేశారు.
అనుష్క శర్మ హెయిర్ కట్ చేయడమే కాదు... చేస్తున్న సమయంలో వీడియో కూడా తీసుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసి చాలామంది షాక్ అయ్యారు. షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. "బయటకు కనిపించని కళలు ఉద్భవిస్తున్నాయి" అని అనుష్క శర్మ పేర్కొన్నారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో "బ్యూటిఫుల్ హెయిర్ కట్ బై మై వైఫ్" అంటూ శ్రీమతికి విరాట్ కోహ్లీ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. సెలబ్రెటీలలో ప్రేక్షకులకు తెలియని కళలు ఏమున్నాయో... ఎంత మంది వాటిని బయట పెడతారో చూడాలి.
Also Read