బాలయ్య గుర్రం మీది నుంచి పడిపోయారా..?
on May 31, 2016
సీనియర్ హీరోల్లో స్టంట్స్ చేయమంటే ముందుండేది నందమూరి నటసింహమే. బాలయ్యకు వందేళ్లు వచ్చినా కూడా విలన్ పాత్ర మీదకు ఎగరగలరు. అది ఆయన ఎనర్జీ. ఇదే ఉత్సాహంతో బాలయ్య మొరాకోలో జరిగిన షూట్ లో పాల్గొన్నారు. చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ వార్ సీక్వెన్స్ అంతా చాలా బాగా వచ్చిందట. అనేక గుర్రాలు, ఒంటెలు ఉపయోగించి తీసిన ఈ యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య తన గుర్రం మీద నుంచి పడిపోయారట. చుట్టూ ఉన్న గుర్రాల్ని చూసి ఆయన కూర్చున్న గుర్రం భయపడి బ్యాలెన్స్ తప్పిందని, దాంతో బాలయ్య కిందపడ్డారని మూవీ వర్గాల సమాచారం. అయితే ఇక్కడే బాలయ్య ఎనర్జీ గురించి చెప్పుకోవాలి. కింద పడినా కూడా షూట్ కంటిన్యూ చేసి ఆ తర్వాతే హాస్పిటల్ కు వెళ్లారట. అయితే ఆయనకు పెద్దగా ఏమీ తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సిటీకి వచ్చేసిన క్రిష్ అండ్ కో, సిటీ అవుట్ స్కర్ట్స్ లో వేసిన 10 ఎకరాల్లో, సెట్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడే మెజారిటీ షూటింగ్ జరగబోతుందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ శాతకర్ణిని సంక్రాంతికి తీసుకురావాలనేది మూవీ టీం ప్లాన్.