ఆసక్తి కలిగిస్తున్న నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్..!
on May 31, 2016
కెరీర్ మొదట్లో రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ల బాటలో వెళ్లి దెబ్బతిన్నాడు కుర్ర హీరో నిఖిల్. స్వామి రారా తర్వాత మాత్రం అతని సినిమా సెలక్షన్లో క్లియర్ గా మార్పు వచ్చింది. డిఫరెంట్ స్టోరీ లైన్ ఉన్న సినిమాలు తీసుకుని మినిమం హిట్స్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ప్రోసెస్ లో నిఖిల్ చేస్తున్న మరో సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మొదట అమల అన్న పేరు అనుకున్నా మళ్లీ ఎందుకో ఛేంజ్ చేశారు. ఇప్పటికే ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. ఒక లాంతర్ లాంటి వస్తువు పగిలిపోతుంటే, నిఖిల్ దాని వైపు భయంగా చూస్తున్నట్టు ఉన్న ఈ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య లాంటి వైవిధ్యమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న నిఖిల్ ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నాడా అన్న ఇంట్రస్ట్ ను కలిగించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పివి రావు నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఆత్మ ఒక సీసాలో ఇరుక్కుపోతుందని, దాన్ని బయటికి తీసిన తర్వాతి నుంచి హీరోకు ఎలాంటి కష్టాలు మొదలయ్యాయి అనేదే స్టోరీ లైన్ గా కనిపిస్తోంది. శంకరాభరణం తో భారీ ఫ్లాప్ ను ఎకౌంట్ లో వేసుకున్న నిఖిల్ ఈ సినిమా మళ్లీ తనను హిట్ మెట్టెక్కిస్తుందని ఆశిస్తున్నాడు. నిఖిల్ సరసన హెబ్బా పటేల్, నందిత శ్వేత నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
