రీమేక్ పై దృష్టి పెడుతున్న మాస్ రాజా..!
on May 31, 2016
మాస్ మహారాజ్ రవితేజ లీన్ ప్యాచ్ లో ఉన్నాడు. సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. వీటికి తోడు రెమ్యునరేషన్ ఇష్యూస్ తో సినిమాలు వదిలేసుకుంటున్నాడని వస్తున్న రూమర్లు కూడా రవికి బ్యాడ్ గా మారుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరంలో ఉన్న రవితేజ, రీమేక్ సినిమాపై దృష్టి పెట్టబోతున్నాడట. గతంలో తీసిన దొంగోడు, వీడే, నా ఆటోగ్రాఫ్ లాంటి రీమేక్ సినిమాలన్నీ యావరేజ్ లేదా ఫ్లాపులుగానే మిగిలిపోయాయి. దీంతో ఆ తర్వాత మళ్లీ రీమేక్ జోలికి వెళ్లలేదు మాస్ రాజా. అయితే ఇప్పుడు కొత్త కథల్ని ఎంచుకుని రిస్క్ చేసేకంటే, ఇప్పటికే ప్రూవ్ అయిన కథతో సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. మూడేళ్ల క్రితం బాలీవడ్ లో చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ గా నిలిచింది జాలీ ఎల్ ఎల్ ఎల్బీ. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రవితేజ బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అవుతుంది. ఒక కేసులో న్యాయం చేయడం కోసం పెద్ద స్థాయి లాయర్ ను చిన్న లాయర్ ఢీకొట్టి గెలవడమే ఈ సినిమా కాన్సెప్ట్. ఇప్పటికే ఈ సినిమాను తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తీశాడు. అక్కడ కూడా ఫర్లేదనిపించుకుంది. మరి రవి ఈ సినిమాతోనైనా ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.