ఎ ఆర్ రెహమాన్ గురించి ఒక సీక్రెట్..!
on May 30, 2016
దేశంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు, రెండు ఆస్కార్స్ గెలిచిన తొలి భారతీయుడిగా గుర్తింపు. ఇవి చాలు ఎ ఆర్ రెహమాన్ స్థాయి గురించి చెప్పడానికి. రెహమాన్ సంగీతానికి ఫిదా అవ్వని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. చరిత్రలో నిలిచిపోయే పాటల్ని ఎన్నింటినో మనకందించిన రెహమాన్ అంత అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడం వెనుక కారణమేంటి..? ఆయన సీక్రెట్ ఏంటి..? సాధారణంగా ఈ ప్రశ్నలకు సమాధానంగా, ఆయన ఎక్కువ పాటలు వింటుంటారేమో అని ఊహిస్తాం. అయితే విచిత్రమేంటంటే, రెహమాన్ కు అసలు పాటలు వినడమే ఇష్టం ఉండదట. తన పాటలే కాదు, ఎవరి పాటలూ ఆయన వినరట. కేవలం మౌనంగా నాతో నేను గడపడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నిరంతరం సంగీతంలో ఉండే నాకు పాటలు వినడం కంటే, వాటికి దూరంగా ఉండటమే ఇష్టం అంటున్నారు ఎ ఆర్ రెహమాన్. ఈ మౌనమే ఆయనలో కొత్త కొత్త పాటల్ని పుట్టిస్తుంటుందట. అదండీ విశ్వవిఖ్యాతి పొందిన రెహమాన్ సంగీతం వెనుక సీక్రెట్.