ఎన్ని లాంగ్వేజ్ లు కవర్ చేస్తావ్ సిద్ధూ ..?
on May 30, 2016
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఇప్పుడు మల్లూ వుడ్. తమిళ హీరో సిద్ధార్ద్ ప్రస్థానమిది. బాయ్స్ తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఎంటరైన సిద్దార్ధ్, ఆ తర్వాత రంగ్ దే బసంతి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగలిగాడు. అయితే ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ మీద పడ్డాడు. ఇక్కడ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు అతని కెరీర్ కు హెల్ప్ అయ్యాయి. అయితే ఆ తర్వాత స్వయం తప్పిదాలు, సినిమాల సెలక్షన్ లాంటివన్నీ కలిపి మనోడి కెరీర్ ను డౌన్ చేసేశాయి. దాంతో మళ్లీ హైదరాబాద్ నుంచి మకాం ను చెన్నై కి మార్చి అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అక్కడ కూడా వరసగా జిగర్తాండా, జిల్ జంగ్ జక్ లాంటి సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇప్పుడు మనోడి చూపు మల్లూవుడ్ పై పడింది. మళయాళంలో అక్కడి స్టార్ హీరో దిలీప్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నాడు. కమ్మర సంభవం అన్న పేరుతో ఈ మూవీని రతీస్ అంబట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి అక్కడ మంచి క్రేజ్ ఉండటంతో, ఎలాగైనా మళయాళంలో కూడా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు సిద్ధార్ధ్. మరి మళయాళంలో అయినా సిద్ధూ కు అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
