మాజీ ప్రేమికుల సినిమా హిట్టైంది..!
on May 30, 2016
తమిళంలో పాటు తెలుగులో కూడా నయనతార శింబుల ప్రేమకథ ఫ్యామస్. వీళ్లిద్దరి మధ్యా జరిగిన ప్రతీ సంఘటన పబ్లిక్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. అయితే అతి కష్టమ్మీద ఇద్దర్నీ కలిపి యాక్ట్ చేయించాడు తమిళ డైరెక్టర్ పాండిరాజ్. ఇదు నమ్మ ఆలు అన్న పేరుతో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు తమిళ బాక్సాఫీస్ సెన్సేషనల్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమా పూర్తై చాలా కాలమే అయింది. అయితే ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు చాలా అడ్డంకులు దాటుకుని గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తమిళ తంబీలు ఫిదా అయిపోయారు. ఒక గొప్ప ప్రేమకథ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నింటికంటే మించి, ఒకప్పటి లవర్స్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అయిందో లేదో చూడటానికే హాల్ కు వెళ్లేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే కథతో రూపొందిన ఈ సినిమా, శింబు నయన్ ల రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉండటం విశేషం. మూవీ ఫస్ట్ వీకెంట్ కు వరల్డ్ వైడ్ 14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. శింబు నయన్ ల కెరీర్లలో ఇదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. వీళ్లిద్దరి కాంబో క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
