ఆమె అంటే భయం అంటున్న పూరీ!
on May 28, 2015
పూరీ జగన్నాథ్ కూడా భార్యా బాధితుల లిస్ట్ లో చేరాడట!.అసలు పూరీ ఇంట్లో ఉండేదెప్పుడు? ఎప్పుడు చూసినా బ్యాంకాక్ లోనే కదా తిష్టవేస్తాడు. పాపం ఆమెకి వేధించే టైమేది అంటారా? అసలు విషయం ఏంటంటే ఆమె బాధ భరించలేకే బ్యాంకాక్ వెళ్లిపోతున్నాడట. వాళ్లో వీళ్లో చెబితే సరేలే అనుకోవచ్చు. స్వయంగా పూరీ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. కథ అనగానే బ్యాంకాక్ ఎందుకండీ హాయిగా ఇంట్లోనే కూర్చుని రాసుకోవచ్చుగా అని ఓ షోలో అడిగారు. అమ్మో...ఎంతమాటన్నారు. ఇంట్లో ఉన్నంతసేపూ కథలు, కాకరకాయలు అంటే పెద్ద రభసే జరుగుతుందని సెలవిచ్చాడట. అందుకే ఛలో బ్యాంకాక్ అని చెప్పాడు. అయినా ఎవరు భరిస్తారు చెప్పండి. ఎంత ప్రొఫెషన్ అయినా కొంతవరకే కదా? పర్సనల్ లైఫ్ ఉండదా ఏంటి? ఆమె అభిప్రాయంలో తప్పేం లేదు అంటున్నవారు కొందరైతే....ప్రోఫెషన్ కూడా ముఖ్యమే కదా సో పూరీ బ్యాంకాక్ వెళ్లడంలోనూ తప్పులేదంటున్నారు ఇంకొందరు. మొత్తానికి ఇంట్లో రచ్చ సంగతి పక్కనపెడితే పూరీ బ్యాంకాక్ వెళ్లడం వెనుక ప్రధాన కారణం వాళ్లావిడే అన్నది ఫైనల్!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
