బాలకృష్ణ మనవడి పేరు 'దేవాన్ష్'
on May 28, 2015
ఎన్టీఆర్ జయంతి రోజున నారా వారసుడికి పేరు పెట్టారు. తాత ఎన్టీఆర్ జయంతి సందర్బంగా తమ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, తన కుమారుడికి 'దేవాన్ష్' అనే పేరు పెట్టినట్లు లోకేష్ ట్విట్టర్ ద్వార తెలిపారు. బాలకృష్ణ దంపతులు, ఇతర బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చిన్నారిని ఆశీర్వదించారు. ఎన్‌టిఆర్ జయంతి రోజున ఇధి ప్రకటించడం నందమూరి అభిమానులకి, టిడిపి శ్రేణులకి ఎంతో ఆనంధానిచ్చింది. ‘దేవాన్ష్’ ఎవరి పోలికలంటూ అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. మొత్తానికి తమ ఆనందాన్ని లోకేష్ దంపతులు అభిమానులతో ఇలా పంచుకున్నారు.