ఒక్క సినిమాకే అంత పెరిగిందా?
on May 28, 2015
బాధపడితే కానీ బోధపడదట. యంగ్ హీరో రాజ్ తరుణ్ ని చూసి అంతా ఇదే అనుకుంటున్నారు. తీసిందే ఒక్కసినిమా...ఏడాది దాటినా మరోటి రాలేదు కూడా... కానీ అప్పుడే కాసులే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాడట కుర్రాడు. సుకుమార్ దర్శకత్వంలో కుమారి 21 ఎఫ్ తో పాటు సినిమా చూపిస్త మావ అనే రెండు ఆఫర్స్ రాజ్ చేతిలో ఉన్నాయి. ఇంతలో డేట్స్ కావాలంటూ ఇంకొంతమంది నిర్మాతలు అడిగితే....కోటి ఇస్తే రండి.....లేదా కనిపించకండి అని ఓ గీత గీశాడట. దీంతో అవాక్కవడం నిర్మతాల వంతైంది. ఒక్క సినిమా హిట్టైతేనే పరిస్థితి ఇలా ఉంది సెట్స్ మీదున్న రెండు ప్రాజెక్టులు కూడాసక్సెస్ అయితో మరేమైనా ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నారట. సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతే కుర్రాడి వైపు కన్నెత్తి చూడడం కష్టమే. పద్ధతి మార్చుకోపోతే.....తెరపై వెలిగేది కొన్నాళ్లు మాత్రమే అంటున్నారు. వినిపిస్తోందా ఉయ్యాల చిన్నోడా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
