నేను తండ్రినే..ఆ బాధ నాకూ తెలుసు: ఎన్టీఆర్
on May 12, 2015
క్యాన్సర్‌తో బాధపడ్తున్న చిన్నారి శ్రీనిధిని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించాడు. జూనియర్ ఎన్టీఆర్‌కి చిన్నారి శ్రీనిధి వీరాభిమాని. తమ కుమార్తెకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం కావడంతో, ఆ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రచారం చేశారు. ఇది తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, స్వయంగా వెళ్లి శ్రీనిధిని పరామర్శించాడు. చిన్న జ్వరం వస్తేనే పిల్లల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారనీ, తండ్రిగా తనకూ ఆ కష్టం తెలుసన్న జూనియర్ ఎన్టీఆర్, తన పరామర్శతో కొంతైనా పాపకు సాంత్వన కలుగుతుందని ఆశిస్తున్నాననీ, త్వరగా శ్రీనిధి కోలుకోవాలని కోరుకుంటున్నాననీ అన్నాడు. పాప పరిస్థితిని చూస్తోంటే గుండె తరుక్కుపోతోందనీ, ఆమె తల్లి దండ్రుల ఆవేదనను తాను అర్థం చేసుకోగలననీ, శ్రీనిధి కుటుంబానికి సానుభూతి తెలపడంతోపాటు, తనకు చేతనైన సహాయం అందిస్తానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
