వరుణ్ తేజ 'ముకుంద' రిలీజ్ డేట్
on Oct 17, 2014
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ 'ముకుంద' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 'ముకుంద'ఆడియో ఫంక్షన్ ఇప్పటికే జరగవల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. నవంబర్ రెండో వారంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేయడానికి నాగబాబు ప్లాన్ చేస్తున్నారట. అన్నయ్య చిరు, తమ్ముడు పవన్ కల్యాణ్ చేత ఆడియో రిలీజ్ చేయించి సినిమా మంచి హైప్ తేవాలని భావిస్తున్నారట. సినిమా రిలీజ్ కి ఇంకా సమయం వుండడంతో కొన్ని దృశ్యాల్ని మళ్లీ రీషూట్ చేసి ప్యాచప్ వర్క్ చేసుకుంటున్నారని సమాచారం.