మెగా ఆడియో వాయిదా?
on Oct 16, 2014
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పిల్లా నువ్వులేని జీవితం' మూవీ ఆడియో వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదట ఈ సినిమా ఈ నెల 18న మెగా కుటుంబం సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో హుధూద్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించడానికి విశాఖలోనే మూడు రోజులు వుండాలని నిర్ణయించుకున్నారు. అలాగే మిగతా మెగా హీరోలు ఇప్పుడు ఫంక్షన్లకి వచ్చే మూడ్ లో లేరు. కాబట్టి ఆడియో రిలీజ్ ని ఈనెల 25కి వాయిదా వేసినట్లు సమాచారం.