'ఊపిరి'తో సెగలు రేపబోతుంది!!
on Nov 25, 2015
నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ గా తెలుగు, తమిళ్ భాషల్లో ఓ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా 'ఊపిరి' అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీతకరణ 80 శాతం పూర్తయింది. అయితే ఇలాంటి డిఫరెంట్ మూవీలో ఓ ఐటెమ్ నంబర్ ఉంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన యూనిట్.. ఓ మాంచి మసాలా సాంగ్ ను ఐటం బాంబ్ నోరా పథేహీనితో ప్లాన్ చేశారరని సమాచారం. ప్రస్తుతం నోరాపై ఆ పాటని తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. నోరాతో కలిసి కార్తీ కూడా స్టెప్పులేస్తాడని సమాచారం. గోపీ సుందర్ అదిరిపోయే మాస్ ట్యూన్స్ ను కంపోజ్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే టెంపర్ , బాహుబలి, కిక్-2, షేర్ చిత్రల్లో ఐటం భామగా అలరించిన నోరా `ఊపిరి`లోనూ కిక్కెక్కించేందుకు రెడీ అవుతోందన్నమాట.