శ్రీకాంత్ ని టెన్షన్ పెడుతున్న మహేష్ బాబు
on Nov 25, 2015
తమిళ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించబోయే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేలోపు బ్రహ్మోత్సవం చిత్రాన్ని పూర్తి అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. దీని కోసం దర్శకుడు శ్రీకాంత్ పై కాస్త ఒత్తిడి పెడుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. శనివారం నుంచి కంటిన్యువస్ గా హైదరాబాద్ పరిసరాల్లో బ్రహ్మోత్సవం చిత్రీకరణ సాగించబోతున్నారు. ఆ వెంటనే కొత్త షెడ్యూల్ కోసం ఊటీ పయనమవుతున్నారట. అయితే మహేష్ మాత్రం ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేయాల్సిందేనని శ్రీకాంత్ కి చెప్పాడని సమాచారం. ఏప్రిల్ లో వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకునేలా రిలీజ్ చేయాలని సూచించాడట. బ్రహ్మోత్సవం లో కాజల్ ,సమంత, ప్రణీతలతో మహేష్ రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.