సమంత, నయనతార తిక్క కుదిరిందా?
on Sep 30, 2015
అందంగా వుంటే చాలదమ్మా... హీరోయిన్లుగా స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తే సరిపోదమ్మా... సంపాదించిన దానికి టాక్స్ కూడా కట్టాలి.. లేకపోతే లావైపోవడం మాత్రమే కాదు... ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళకి బుక్కయిపోతారు కూడా. నాలుగు దక్షిణాది భాషల్లోనూ దున్నేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్న మలయాళం ముద్దుగుమ్మలు సమంత, నయనతారలకి ఇదేం పీనాసి బుద్ధో. ఎంచక్కా బోలెడంత సంపాదిస్తున్నారు... కానీ టాక్స్ కట్టడానికి మాత్రం చేతులు రావు.. అందుకే బుధవారం నాడు ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు జరిపిన దాడుల్లో వీళ్ళిద్దరూ అడ్డంగా దొరికిపోయారని వార్తలు వచ్చాయి.
సమంత దగ్గర లెక్కల్లో లేని డబ్బు బాగా దొరికిందట. ఇక నయనతారకు చెందిన కొచ్చీ, తమిళనాడు, హైదరాబాద్ ఇళ్ళలో అయితే బోలెడంత బ్లాక్‌మనీ దొరికిందని సినిమా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఇలా దొరికిపోయేసరికి చాలామంది హీరోయిన్లు ఉలిక్కిపడి తమ ఇన్కమ్ టాక్స్ లెక్కలు సరిచూసుకునే పనుల్లో పడ్డారని సమాచారం. ఇదిలా వుంటే, సమంత, నయనతారలకు జాయింట్‌గా తిక్క కుదిరిందని వాళ్ళ బాధితులు చెప్పుకుంటున్నారట. వాళ్ళిద్దరి బాధితులు ఎవరని అనుకుంటున్నారా.. ఇంకెవరండీ... ప్రొడ్యూసర్లు... స్టార్ హీరోలేమో వీళ్ళనే హీరోయిన్లుగా కావాలని అంటూ వుంటారు.. వీళ్ళేమో రెమ్యునరేషన్ విషయంలో కొండమీద ఎక్కి కూర్చుంటారు.
హీరోగారి రికమండేషన్ కావడంతో నిర్మాతలు నెత్తీనోరూ బాదుకుంటూనే వీళ్ళకు కోట్లకు కోట్లు ఇస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల మీద ఎలాంటి జాలీ దయా చూపించని సమంత, నయనతారల తిక్క భలేగా కుదిరిందని అనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి.