మెగా హీరో పై దిల్‌రాజు ట్రిక్!!
on Oct 1, 2015
ప్రతిభను కొలిచే విషయంలో ఎవ్వరికీ తీసిపోడు దిల్‌రాజు. సినిమా చూడకుండానే దాని రిజల్ట్ చెప్పేసే కెపాసిటీ ఉన్నోడుగా దిల్‌రాజుకి మంచి పేరుంది. భవిష్యత్తులో స్టార్ అవుతాడు అనిపిస్తే... వాళ్లని ముందే లైన్‌లో పెట్టేయడం ఆయనకు అలవాటు. అలా సాయిధరమ్ తేజ్‌ని తొలి చూపులోనే పట్టేశాడు. రేయ్ ప్రచార చిత్రాలు చూసి.. సాయి చేతితో ఒకేసారి 5 సినిమాల అగ్రిమెంట్ కుదుర్చుకొన్నాడు దిల్‌రాజు.
ఓ హీరోతో వరసగా ఇన్ని సినిమాల ఎగ్రీమెంట్ కుదుర్చుకోవడం బహుశా..టాలీవుడ్‌లో ఇదే తొలిసారేమో. వీరిద్దరి కలయికలో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్లే.. దాంతో దిల్‌రాజుకి మంచి లాభాలొచ్చాయి. సుబ్రమణ్యంని తొమ్మిది కోట్లకు తీస్తే.. దాదాపు 20 కోట్ల బిజినెస్ చేసింది. శతమానం భవతి, సుప్రీమ్ సినిమాలు కూడా వీరి కాంబినేషన్లోనే వస్తున్నాయి. ఇది కాక సాయి మరో సినిమా కూడా చేయాల్సివుంది. ఈ 5 సినిమాలకూ ఒకేసారి రూ.5 కోట్లు టోకుగా సాయి చేతిలో పెట్టేశాడట దిల్‌రాజు.
ఒకేసారి 5 కోట్లు వస్తుంటే... అదీ తొలి సినిమా రేయ్ విడుదల కాకముందే అంటే సాయి వదలుకోడుగా. తానూ.. రెడీ అయిపోయాడు. అయితే సుబ్బు హిట్‌తో సాయిధరమ్ తేజ్ రేంజు కాస్త పెరిగింది. రూ.2 కోట్లయినా ఇచ్చి సాయితో సినిమా చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ.. దిల్‌రాజు ఒక కోటికే ఇలాంటి హీరోని సొంతం చేసుకొన్నాడు. దిల్ రాజు ట్రిక్ అంటే అదే.