100కోట్ల స్టొరీ చేస్తున్న వినాయక్!!
on Sep 30, 2015
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. వంద కోట్ల ప్రాజెక్ట్ మీద కన్నేశాడా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 'శ్రీమంతుడు' ఆడియో వేడుకలో మహేష్ తో వంద కోట్ల సినిమా చేయాలనే కోరికను బయపెట్టిన వినాయక్..ఇపుడు ఆ సినిమా కోసం నిజంగానే కథను ప్రిపేర్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ తో స్టోరీ డిస్కషన్స్ కూడా చేస్తున్నాడట. ఇదంతా చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమాని శరవేగంగా పూర్తి చేసే పనిలో వున్న మహేష్, దీని కోసం శ్రీకాంత్ అడ్డాలకు స్ట్రిక్ట్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడట. వినాయక్ డైరెక్షన్ లో చేయడానికి రెడీగా ఉన్నానని గతంలోనే మహేష్ హింటిచ్చాడు. సో బ్రహ్మోత్సవం తర్వాతే వినాయక్ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
