LATEST NEWS
అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.  ఈ కేసులో అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించజాలమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసులకు భయపడనంటూ గంభీర ప్రకటనలు చేసిన కాకాణి తీరా పోలీసులు నోటీసులు అందజేయడానికి వస్తే అజ్ణాతంలోకి వెళ్లి పోవడం తెలిసిందే.   వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు చేర్చారు. వరుసగా రెండు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి, మంగళవారం (ఏప్రిల్ 1)న తాను బుధవారం తరువాత అంటే గురువారం అందుబాటులో ఉంటాను అంటూ సమాచారం పంపారు.  అదే సమయంలో కాకాణి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా, పోలీసులు కాకాణి విచారణకు గైర్హాజర్ అయిన విషయాన్నీ అలాగే రెండు రోజులుగా నోటీసులు తీసుకోకుండా కాకాణి తప్పించుకు తిరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది క్లాసికల్ నృత్య రీతులలో  కూచిపూడి నృత్యం అత్యంత క్లిష్టమైనది. దీనిలో కాలి వేళ్లనుండి ఆపాదమస్తకం డాన్స్ లో భాగం గా స్పందించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటి గొప్ప కళ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది  పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు . ఉగాది ఉత్సవాల సందర్భంగా మచిలీపట్టణం సమీపంలోని  కూచిపూడి నాట్యకళకు జన్మ స్థలం  కూచిపూడిలో  రెండురోజులపాటు  నాట్యగురు,కేంద్ర సాహిత్య,నాటక అవార్డు గ్రహీత డా. వేదాంతం రాధే శ్యామ్ నేతృత్వం లో  జరుగుతున్న "కూచిపూడి నాట్య శిల్పారామం"  నృత్యోత్సవాలలో  మొదటిరోజు ముఖ్య అతిధిగా  పాల్గొన్న వేదాంతం రాధేశ్యామ్   జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.  పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ అపురూపమైన నృత్యం నేర్చుకున్నప్పటికీ పలువురు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన ఖరీదైన కాస్ట్యూమ్స్,ఇమిటేషన్ ఆభరణాలు కొనలేని స్థితిలో  వున్నారనీ, అటేవంటివవారికి ప్రభుత్వం, దాతలు నృత్య దుస్తులు, ఇమిటేషన్ ఆభరణాలు  సమకూర్చాలని కోరారు.  నాట్య గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ బాల కొండలరావు   విశాఖపట్నం లో తానూ స్థాపించిన కూచిపూడి నాట్య అకాడెమి ద్వారా వేలాది మంది నృత్య కళాకారిణులను తీర్చి దిద్దినట్లు ఆమె తెలిపారు.  విశాఖపట్నం, పార్వతీపురం,హైదరాబాద్,లతో పాటు పలు ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, నాట్య గురువు లతో కూచిపూడి లొ ఉగాది నాట్య ఉత్సవం వైభవంగా జరిగింది.  
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్  రఘురామ కృష్ణంరాజు  కస్టోడియల్ టార్చర్  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి  డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి ఈ నెల  7, 8 తేదీల్లో సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ విచారణకు హాజరు కాకున్నా, విచారణకు సహకరించకున్నా  మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది.  ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో తప్పుడు  మెడికల్ రిపోర్టు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ఆమె ముందస్తు బెయిలు పిటిషన్ ను తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు  ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, విచారణకు హాజరై సహకరించాలని సూచించింది.  అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని, ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను మంగళవారం (ఏప్రిల్ 1) విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.  
తమిళనాడుకు చెందిన వివాదాస్పద స్వామి నిత్యానందస్వామి మరణించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన మేనల్లుడు సుందరేశ్ నుంచే  ఈ ప్రకటన వెలువడింది. సినీ నటి రంజితతో రాసలీలతో  ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. 2022లో కూడా నిత్యానంద స్వామి చనిపోయినట్టు వచ్చిన వార్తలను స్వయంగా ఖండించారు. ప్రస్తుతం వస్తున్న మరణ వార్తలను ఇంతవరకు నిత్యానంద స్వామి ఖండించలేదు. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి కైలాస పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు. కైలాస దేశానికి  ప్రత్యేక కరెన్సీ  కూడా ఉంది. ఇండియా నుంచి వెళ్లిపోయిన నిత్యానంద ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు వేల కోట్లకు అధిపతి అయిన నిత్యానందకు వారసులు ఎవరు అనేది ప్రశ్నార్ణకమైంది. కైలాస దేశానికి నిత్యానంద ప్రధాని పదవిలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించుకున్నారు. దక్షిణ అమెరికా ఈక్వెడార్ లో కైలాస దేశం ఉందని చెబుతుంటారు. . 
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం పోటీసులు జారీ చేసింది. ఏపీలో  అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో  అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.   ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.  ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై  జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 1) విచారించింది. ఈ సందర్భంగా సంజయ్ బెయిలు రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై కూంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేసింది.  
ALSO ON TELUGUONE N E W S
Paayal Rajput has been trying her luck in Telugu Cinema and Indian Cinema with different films. She won best debut actress award with her film, RX100. After Mangalavaaram failure, she did not find many opportunities. With her one tweet on X, she raised the debate about nepotism in Indian Cinema, again.  She wrote, "There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break through."  Paayal expressed her grief as the opportunities are passing by. Many started discussing about people from big star families getting opportunities despite the continuous failures. Even though she did not name anyone and stated her position in general terms, people started trolling Ananya Panday, Janhvi Kapoor and Khushi Kapoor.  Mainly, Khushi Kapoor attracted huge trolls as she failed twice with Lovayapa and Nadaaniyan this year. The actress could not garner name for her looks like her elder sister Janhvi. On the other hand, Janhvi Kapoor got trolled stating that she has the attitude but no skills to show-off.  Well, while Paayal might have just wanted to voice out her frustration losing opportunities, she triggered a negative trend of trolls on social media against her younger peers. Maybe these trolls have some valid points, it gets too much to attack only few. 
Cast: Jeet, Prosenjit Chatterjee, Chitrangada Singh, Ritwik Bhowmik, Adil Zafar Khan, Saswata Chatterjee, Subhasish Mukherjee, Mahaakshay Chakraborty, Pooja Chopra Crew:  Written by Neeraj Pandey, Debatma Mandal, Samrat Chakroborty Music by Jeet Ganguly, Sanjoy Chowdhury Edited by Praveen Kathikuloth Cinematography by Tushar Kanti Ray, Arvind Singh, Tarashree Sahoo, Souvik Basu Created and Directed by Neeraj Pandey Produced by Shital Bhatia Genre: Crime Action Drama Thriller No: of Episodes: 07 Available on Netflix Khakee: The Bihar Series attracted many with a director like Neeraj Pandey being at the helm. Now, the director has made Khakee: The Bengal Chapter to follow up the series. The Crime Drama Action Thriller series tries to talk about the dark Nexus in the city of Kolkata. With major stars and actors from Bengali Cinema being part of the series, it got huge traction. But the initial reactions have been highly mixed. Let's discuss about the series in detail.  Plot:  Government, Police and Gangsters works form a dark nexus in Kolkata city. Shankar Baruah also known as Bagha (Saswata Chatterjee) is a big gangster in Kolkata and he has great connections with politicians and higher rank officials in Police. Barun Roy (Prosenjit Chatterjee), a high level politician has close links with Bagha and with his assistance, Bagha reins havoc in the city. As the opposition and public pressure to eliminate Bagha increase, Government appoints IPS Arjun Maitra (Jeet) to bring order in the city. Can he achieve this and bring order in the city? Watch the series to know more.  Analysis:  Neeraj Pandey has made interesting crime drama films like Special 26, Baby and with OTT platforms boom, he made series like Special Ops and now, Khakee. But the director seems to be progressively declining in delivering strong content. Even though on paper things might sound interesting, in execution he is not being able to deliver the same. The slow paced nature is not too much of a problem in first few episodes but towards the end, the simple things seem to have been dragged out of proportion.  The set-up looks interesting and we are hooked by the first episode. And the interesting premise slowly starts getting diluted with scenes being too slow and then some unnecessary sub plots also start to test our patience. By the time, the interesting portions re-appear, we are left wondering fine. He did showcase great intent and executed his ideas solidly in previous one but this one just seems like an after thought to cash in on the success of earlier one.  Cienmatography is a big let down. The Saturated hues don't really capture the real beauty of the locations and we are left wondering, if we are watching a TV drama. Also, the execution falls flat with major twists being diluted with the pacing. Editing and BGM could have been better at many places as they feel tacky at places. Still, we can watch it because of the performances to an extent.  Heavyweights like Saswata Chatterjee, Prosenjit Chatterjee deliver performances that arrest us. Even Jeet is very good for most of his parts. Still, there is a lot we would expect from a Neeraj Pandey crime drama. His inconsistency often comes across in different films and this series is one such. While it has a good premise and good drama to hold on to, the execution has brought the impact down, big time.  In Conclusion:  Doesn't live up to the first one's intensity and drama.  Rating: 2.25/5 
  'హనుమాన్'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జ (Teja Sajja).. ప్రస్తుతం 'మిరాయ్' (Mirai) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటిస్తున్నాడు. ఆగస్టు 1న విడుదల కానున్న 'మిరాయ్'పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.   మిరాయ్ మూవీలో రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ రోల్ కోసం దుల్కర్ సల్మాన్ ని అనుకున్నారట. అయితే ఇప్పుడు రానా పేరు తెరపైకి వచ్చింది. రానా, తేజ సజ్జ మధ్య మంచి అనుబంధముంది. ఈ ఇద్దరు కలిసి ఐఫా అవార్డ్స్ కి హోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మిరాయ్ లో కీ రోల్ కోసం సంప్రదించగా.. రానా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.   హీరో, విలన్ రోల్స్ మాత్రమే కాకుండా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే గెస్ట్ రోల్స్ చేయడానికి కూడా రానా వెనుకాడడు. ఇప్పటికే పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. ఇదే బాటలో ఇప్పుడే మిరాయ్ లో నటించడానికి అంగీకరించాడట. తేజ, మనోజ్ తో పాటు రానా కూడా తోడు కావడంతో.. ప్రేక్షకుల దృష్టి మిరాయ్ పై మరింత పడుతుంది అనడంలో డౌట్ లేదు.  
ఇండియన్‌ టాకీ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు కొన్ని వేల సినిమాలు వచ్చాయి. వాటిలో ఒక హీరో నటించిన సినిమాలు కాకుండా ఒకరికి మించి హీరోలు నటించిన సినిమాలు కూడా ఎన్నో వచ్చాయి. ఇలా ఎక్కువ మంది హీరోలు కలిసి నటించిన సినిమాలు హిందీలోనే ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. ముగ్గురు, నలుగురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన సందర్భాలు కూడా మనం చూశాం. అయితే అది రాను రాను తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు హిందీలో మల్టీస్టారర్స్‌ లేవనే చెప్పాలి. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ ఇద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు. అలాగే కృష్ణ, శోభన్‌బాబు కలిసి 12 సినిమాలు చేశారు. అలాగే కృష్ణంరాజు కూడా మల్టీస్టారర్స్‌ చేశారు. ఆ తర్వాత తెలుగులో కూడా ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. శ్రీకృష్ణార్జునయుద్ధం కారణంగా ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయకూడదని ఎఎన్నార్‌ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 14 ఏళ్ళకు చాణక్య చంద్రగుప్త చిత్రంలో మళ్ళీ ఇద్దరూ కలిసి నటించారు. ఇక కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన చివరి సినిమా మహాసంగ్రామం. ఆ సినిమాలో తన క్యారెక్టర్‌ని తక్కువ చేసి చూపించారన్న కారణంతో శోభన్‌బాబు మల్టీస్టారర్స్‌ చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యారు. అలా తెలుగులో మల్టీస్టారర్స్‌కి తెరపడింది.  చాలా సంవత్సరాల తర్వాత 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మల్టీస్టారర్స్‌కి శ్రీకారం చుట్టారు వెంకటేష్‌, మహేష్‌. ఆ తర్వాత వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ గోపాల గోపాల చేశారు. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు టాప్‌ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే వారి క్యారెక్టర్స్‌కి సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలని ఆ హీరోల అభిమానులు కోరుకుంటారు. అయితే ఈమధ్యకాలంలో ఒకే భాషకు చెందిన హీరోలు కాకుండా వివిధ భాషలకు చెందిన హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్‌ హీరోగా నటించిన సలార్‌ చిత్రంలో మలయాళ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించిన విషయం తెలిసిందే. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ పృథ్విరాజ్‌ నటిస్తున్నారు. అలాగే తమిళ, కన్నడ హీరోలు కూడా తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా బాలీవుడ్‌ హీరో రణబీర్‌కపూర్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దానికి కారణం.. నందమూరి బాలకృష్ణ. ఆయన సారధ్యంలో నడుస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో దీని ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్‌ ఈ షో సీజన్‌ 4కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షోలో రణబీర్‌ కపూర్‌ ఫోటో చూపించి అతనిపై అభిప్రాయం చెప్పమని బన్నీని అడిగారు బాలయ్య. దానికి బన్నీ సమాధానమిస్తూ మా జనరేషన్‌లో గొప్ప ఆర్టిస్ట్‌ రణబీర్‌ అని సమాధానం చెప్పారు. వెంటనే బాలయ్య స్పందిస్తూ.. ‘మరి ఇద్దరూ కలిసి ఒక సినిమా చెయ్యొచ్చు కదా’ అని అడిగారు. దానిపై బన్నీ స్పందించకపోవడంతో ‘మీ ఇద్దరికీ సరిపోయే కథను ఎవరూ చేయలేకపోతే నేనే స్టోరీ ఇస్తాను. అంతేకాదు, అవసరమైతే డైరెక్షన్‌ కూడా నేనే చేస్తాను’ అన్నారు బాలయ్య. దానికోసం ఆరు నెలల టైమ్‌ ఇస్తున్నానని, ఆలోచించుకొని చెప్పమని అన్నారు. అన్‌స్టాపబుల్‌ షోలో ఈ ప్రస్తావన వచ్చిన నాటి నుంచి రణబీర్‌ కపూర్‌, అల్లు అర్జున్‌ మల్టీస్టారర్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ షో జరిగి ఇప్పటికి 5 నెలలు అయింది. కానీ, ఈ మల్టీస్టారర్‌ గురించి మళ్ళీ ఎవరూ ప్రస్తావించలేదు. మరి ఆరునెలలు టైమ్‌ ఇచ్చిన బాలయ్య దీని గురించి మాట్లాడతారో, లేక బన్నీ ఏదైనా అప్‌డేట్‌ ఇస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రణబీర్‌ కపూర్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే అది ఒక రేంజ్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు కలెక్షన్లపరంగా ఉన్న అన్ని రికార్డులను ఈ ప్రాజెక్ట్‌ చెరిపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇద్దరూ కలిసి సినిమా చేస్తారో లేదో తెలీదుగానీ, సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు మొదలయ్యాయి.
  మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ఎల్2: ఎంపురాన్' (L2 Empuraan). మలయాళ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన 'లూసిఫర్'కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 27న విడుదలైన 'లూసిఫర్-2 మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ 'లూసిఫర్-2' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.   'ఎల్2: ఎంపురాన్' సినిమా ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మలయాళ సినీ చరిత్రలో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా ఎంపురాన్ నిలిచింది. అలాగే వేగంగా ఈ ఫీట్ సాధించిన మలయాళ సినిమాగానూ రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఇండస్ట్రీ హిట్ దిశగానూ పరుగులు తీస్తోంది.   మలయాళ సినిమాల పరంగా రూ.242 కోట్ల గ్రాస్ తో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ప్రస్తుతం 'మంజుమ్మ‌ల్ బాయ్స్' ఉంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన ఎంపురాన్.. ఇప్పుడు ఆ మూవీని క్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఎంపురాన్ జోరు చూస్తుంటే.. పది రోజుల వసూళ్లతోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా సరికొత్త రికార్డుని నెలకొల్పే అవకాశముంది.  
కార్తికేయ(Karthikeya)హీరోగా అజయ్ భూపతి(Ajay Bhupathi)దర్శకత్వంలో 2018 లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 తో తెలుగు నాట ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput).ఢిల్లీ కి చెందిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకీ మామ,తీస్ మార్ ఖాన్, జిన్నా,మాయాపేటిక,రక్షణ వంటి పలు చిత్రాల్లో నటించినా అవన్నీ కూడా ఆశించినంత  విజయాన్ని అందుకోలేకపోయాయి.అజయ్ భూపతి దర్శకత్వంలోనే 2023 లో  వచ్చిన మంగళవారం మూవీ కొద్దిగా పర్వాలేదనిపించింది. రీసెంట్ గా పాయల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు 'నటిగా కెరీర్ కొనసాగించడం చాలా కష్టమైన పని.అత్యంత కఠినమైనది కూడా ఒకటి.ఇండస్ట్రీలో రోజూస్ట్రగుల్స్, సవాళ్లే.ఇక్కడ టాలెంట్ కంటే నెపోటిజమే పని చేస్తుందంటు ట్వీట్ వేసింది.ఇప్పుడు   ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది.  పలు హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ భాషల్లోను సినిమాలు చేసిన  పాయల్ చేతిలో కిరాతక అనే సినిమా మాత్రమే ఉంది.    
  డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ సెన్సేషన్ గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). అలాంటి సిద్ధు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. కానీ సిద్ధు కొత్త చిత్రం 'జాక్' విషయంలో ఆ పరిస్థితి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.   సిద్ధు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగాడు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' సినిమాలతో యువతకు చేరువయ్యాడు. ఇక 2022లో సిద్ధు హీరోగా నటించిన డీజే టిల్లు.. థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. సిద్ధుకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చేయగా.. అది కూడా సంచలన విజయం సాధించి, యూత్ లో సిద్ధు పేరు మారుమోగిపోయేలా చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ స్టార్ గా సిద్ధు పేరు పొందాడు. అలాంటి సిద్ధు నుంచి వస్తున్న కొత్త సినిమాపై అంతగా బజ్ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' (Jack) అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు. SVCC బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ, ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా పది రోజులు కూడా లేదు. అయినా ఈ సినిమాపై ఎందుకనో రావాల్సినంత బజ్ రాలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ప్రతిభగల దర్శకుడే.. కానీ, ఆయన బ్రాండ్ ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. ఇక సిద్ధు విషయానికొస్తే.. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు రెండూ కామెడీ ప్రధానంగా తెరకెక్కాయి. కానీ, జాక్ లో కామెడీ కంటే యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతోంది. అలాగే టిల్లు సినిమాలకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. జాక్ నుంచి అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్ రాలేదు. ఇలా పలు కారణాల వల్ల జాక్ సినిమాకి రావాల్సినంత బజ్ రావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బజ్ తో సంబంధం లేకుండా సిద్ధు సైలెంట్ గా వచ్చి.. జాక్ తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.  
అఖిల్ అక్కినేని(Akhil Akkineni)సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది.2023 లో 'ఏజెంట్' తో వచ్చి అభిమానులని,ప్రేక్షకులని నిరాశపరిచాడు.దీంతో అఖిల్ అప్ కమింగ్ మూవీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అఖిల్ చేస్తున్న సినిమాల  విషయంలో అధికారకంగా అప్ డేట్ లేకపోయినా మురళీ కిషోర్ అబ్బూరు అనే కొత్త డైరెక్టర్ తో అఖిల్ చేస్తున్న మూవీ షూటింగ్ దశలో ఉంది.నాగార్జున(Nagarjuna)ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్,ఫస్ట్ లుక్ అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8 న మేకర్స్ విడుదల చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి  అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.అదే జరిగితే    ఏప్రిల్ 8  న అక్కినేని ఫ్యాన్స్ లో అఖిల్ బర్త్ డే తో పాటు సరికొత్త పండుగ వాతావరం వచ్చినట్టవుతుంది.ఇదే రోజు వాళ్ళ ఉత్సాహాన్ని మరింత పెంచేలా అఖిల్  ఒప్పుకున్న ఇంకో రెండు చిత్రాలని కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.  యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే నూతన దర్శకుడితో పాటు సామజవరగమన రైటర్ నందుతో అఖిల్ సినిమాలు చెయ్యబోతున్నాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.వీటినే అధికారకంగా ప్రకటించనున్నారు. అనిల్ సినిమా వంద కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.    
Naga Vamsi in his press meet challenged that even if websites ban him and his films, he won't be worried about promoting them. He opined that people who depend on films and film industry should work for it and not against it. He explained that few websites have been trying to call Mad Square fluke and downgrade its success.  He stated that he did not say anything about reviews as they are personal opinions of people watching them. He said that he can accept them but he cannot accept the propaganda some websites do to prove their review and judgement as perfect against his film.  He opined that it should be easy to encourage a film when its performing well at the box office. Rather some websites started calling it "sequel advantage" and "fluke success" which the producer stated that hurt him badly. Now, the social media discussion is about those websites that try to "always prove that they're right".  But some are trying to change the topic and state that the producer is against reviews. No one can ever challenge a person's right to state their opinion in a democracy. So, a producer like Naga Vamsi is so more hurt with labelling of his film's success rather than reviews.    It is also must to understand that director Kalyan Shankar, youngsters Narne Nithin, Ram Nithin, Sangeeth Shobhan careers are dependent on success this franchise films. If someone downplays the success, their careers will also be effected as perception would change about the success of the film and their acceptance among audiences.  While Naga Vamsi did look over aggressive in his statements, his points are valid. There are many good films that failed at the box office but found audiences on other platforms or years later. Similarly, there are forgettable films that worked for those times and no one remembers them years later.  And reviews have been critical about both such films and trends in films from a long time too. So, accepting the co-existence is a must and there is no need to overtly pull one down or even carry them on our shoulders. Reviews will persist and commercial films that don't agree with reviews will also persist. Better to just acknowledge the fact and move on. 
Salman Khan has been one of the biggest stars of Indian Cinema and he released Sikandar for this year's Eid. The movie makers decided to release on 30th March, Sunday, to overcome Pre-Eid dull box office. Makers anticipated the Eid day to be huge but it did not showcase the expected level growth at the box office.  The movie collected Rs.22 crores Nett collections and on Eid day, it collected Rs.25-26 crores Nett collections. With just Rs.47-48 crores Nett collections for Eid holiday, that too, with a big action entertainer, fans of the actor are unable to digest this sort of box office result.  Sikandar needed to collect above at least Rs.40 crores both the days. The movie would have collected Rs.85-90 crores even with low buzz, 5-6 years ago. Now, due to continuous flops, the collections are too low even though few mass circuits performed better on Eid Day.  Being such a big star over the decades and with 2010's being his best decade in the industry, that too, sporting an unreal domination, fans are expecting a huge comeback from him. Fans are expecting at least good collections to showcase his hold on box office. But this downfall has been too unreal for them.  They are asking him to take few years gap and work on his health, choose better scripts to announce his comeback on the big screen. Rashmika Mandanna's success streak ended with this and AR Murugadoss dream about big comeback can only be fulfilled by Madharasi starring Sivakarthikeyan. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఇంటిని చల్లగా ఉంచుకోవడం రోజువారీ యుద్ధంలా అనిపిస్తుంది.  ముఖ్యంగా ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ పెట్టుకోవాలంటే  విద్యుత్ బిల్లులను  చూసి భయపడుతుంటారు.  కానీ ఈ విద్యుత్ బిల్లులు తగ్గించుకుని పర్యావరణ అనుకూలంగా ఉండటానికి ప్రయత్నించాలని చాలా మంది అనుకుంటారు.  కానీ ఇల్లు చల్లగా ఉండటానికి ఏం చేయాలి?  అనే విషయం చాలా మందికి తెలియదు. ఎయిర్ కండిషనర్లు అప్పటికప్పుడు  వేడి నుండి  ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ, అవి రోజు మొత్తం చల్లగా ఉండటంలో అస్సలు ఉపయోగపడవు.  అయితే ఇంట్లో ఏసీ లేకుండానే చల్లగా ఉంచుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.  వీటిని ఫాలో అయితే వేసవి అంతా చల్లగా హాయిగా గడిచిపోతుంది.   వెదురు కర్టెన్లు లేదా  వట్టివేరు మ్యాట్లకు మారాలి.. ఎక్కువ వేడిని తట్టుకుని వేడిని లోపలి పోకుండా చేసేందుకు సాధారణ కర్టెన్లు తొలగించి వెదురు బ్లైండ్లు లేదా వట్టివేరు చాపలను ఎంచుకోవాలి.   ఈ చాపలను కర్టెన్ లాగా ఉపయోగించుకోవచ్చు.  వట్టివేర్ చాపల మీద నీటిని చల్లితే   ఇంట్లోకి ప్రవేశించే గాలిని సహజంగా చల్లబరుస్తూ, రిఫ్రెషింగ్ మట్టి సువాసనను విడుదల చేస్తాయి. ఇది వేసవి వేడి నుండి చాలా గొప్ప ఉపశమనం ఇచ్చే చిట్కా. మట్టి కుండలతో నేచురల్ కూలర్లు.. ఇంట్లో మట్టి కుండ పెట్టుకుని అందులో చల్లని నీరు తాగడం అందరికి తెలిసే ఉంటుంది.  అయితే చాలా మందికి తెలియని చిట్కా ఏంటంటే.. ఇంట్లో వేడి బాగా ఉన్న ప్రాంతాలలో మట్టి కుండలు ఉంచి ఆ మట్టి కుండలలో నీరు పోయాలి.  కుండలలో నీరు ఆవిరి అవుతూ ఉంటే కుండ చుట్టు పక్కల వాతావరణం చల్గగా ఉంటుంది.  మట్టి కుండలను ఇలా ఉంచడం వల్ల సహజంగా ఇల్లు ఎయిర్ కూలర్లు పెట్టినట్టు ఉంటుంది. క్రాస్ వెంటిలేషన్.. ప్రకృతి ప్రసాదించిన శీతలీకరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి.  ఉదయం,  సాయంత్రం వేళల్లో  కిటికీలను తెరిచి ఉంచాలి. తద్వారా తాజా గాలి లోపలికి ప్రవహిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో వేడి గాలి లోపలికి రాకుండా వాటిని మూసి ఉంచండి. ముఖ్యంగా క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇది చల్లని గాలిని లోపలికి,  వేడి గాలిని బయటకు వెళ్లేలా చేస్తుంది.  ఈ సులభమైన ఉపాయం చాలా తేడాను కలిగిస్తుంది. రంగులు.. నలుపు రంగు క్లాసీగా ఉన్నప్పటికీ, లేత రంగు కాటన్ బెడ్‌షీట్లు, కుషన్ కవర్లు,  కర్టెన్లు వంటివి తక్కువ వేడిని శోషిస్తాయి. అందుకే ఇంట్లో లేత రంగు ఉండే కర్టెన్లు, దిండు కవర్లు, కార్పెట్లు వంటివి ఎంచుకోవాలి.  ఇవి వేడిని బంధించడానికి బదులుగా ప్రతిబింబిస్తాయి, మీ ఇంటిని తాజాగా,  చల్లని  గాలిలితో  ఉంచుతాయి. ఇండోర్ మొక్కలు.. కలబంద, అరెకా పామ్స్, స్నేక్ ప్లాంట్స్,  మనీ ప్లాంట్స్ గాలిని శుద్ధి చేయడమే కాకుండా  అవి ఇండోర్ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కిటికీలు,  సీటింగ్ ప్రదేశాల దగ్గర వాటిని  ఉంచడం వల్ల సహజంగా చల్లటి వాతావరణం ఉండేలా చేస్తాయి.                          *రూపశ్రీ
  ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. చాలామందికి చిన్నతనంలో  ఏప్రిల్ ఫూల్ అంటూ చేసిన సందడి గుర్తొస్తుంది.  చిన్నతనంలో ఏదో ఒక తుంటరి సాకు చెప్పడం,  ఎదుటివారిని భయపెట్టడం వారు భయపడటం లేదా అప్రమత్తం కావడం జరగగానే ఏప్రిల్ ఫూల్ అనడం చాలామంది ఎంజాయ్ చేసిన సంఘటనలే.. ఈ ఏప్రిల్ ఫూల్ అనేది ఒక సరదా రోజుగా  అందరికి తెలుసు.. కానీ ఏప్రిల్ ఫూల్ రోజు జరిగే తమాషా సంఘటనలలో పూల్స్ అయినా పర్లేదు కానీ నిజ జీవితంలో ఫూల్స్ కాకండి అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే అమాయకంగా ఫూల్స్ అయిపోతుంటారు.  నిన్న కాక మొన్నే తెలుగు సంవత్సరం వచ్చింది.   ఈ కొత్త ఏడాదిలో అయినా ఎవరైనా ఫూల్స్ కాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ కింద చెప్పుకున్న విషయాలు గుర్తుంచుకోవాలి. జీవితం, తమాషా.. రోజువారీ జీవితంలో సంతోషం,  తమాషా అనేవి ఉండటం మంచిదే.. కానీ జీవితమే తమాషా కాకూడదు.  ఇలా జీవితమే తమాషా అయితే ఆ తరువాత ఇతరులకు మన జీవితం ఒక ఆట వస్తువుగా లేక విలువ లేని చిత్తు కాగితంలా అనిపిస్తుంది. అందుకే జీవితంలో తమాషా ఉన్నా జీవితాన్ని తమాషా కానివ్వకూడదు.  జీవితంలో లక్ష్యాల  పట్ల,చేస్తున్న పని పట్ల స్పష్టత ఉండాలి.  చెయ్యాల్సిన పనిని ఇతరుల కారణంగా ఎప్పుడూ వాయిదా వేయడం,  చేయకుండా ఆపేయడం వంటివి చేయకూడదు. చేసే పని మంచిది అయినప్పుడు,  ఉపయోగకరమైనది అయినప్పుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ అయ్యి దాన్ని వదలకూడదు. ఎందుకంటే చేసే పని,  పని  చేసే విధానం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది. మంచి, చెడు.. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అనేవి ఉంటాయి.  కానీ మనిషి తన జీవితంలో జరిగే మంచి అయినా చెడు అయినా తాను కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటాడు. ఇది చాలా వరకు తప్పు. అయితే మంచి, చెడు అనేవి వ్యక్తి ఆలోచనా  విధానం మీద ఆధారపడి ఉంటుంది.   ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించే అవకాశం ఉంది. దీని వల్ల మంచి చెడుల విషయం తేల్చుకునే అవకాశం చాలా మందికి ఉండదు. అయితే ఏ పని అయినా  ఇతరులకు అపకారం చేయకుండా నష్టం కలిగించకుండా మనకు మేలు చేసే విధంగా ఉన్నంత వరకు ఆ పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు. విలువలే.. వ్యక్తిత్వం.. ప్రతి మనిషి విలువలు కలిగి ఉండాలి.  ఇలా విలువలు కలిగి ఉండటమే మనిషి జీవితానికి గొప్ప ఆస్తి.  మనిషిలో ఉన్న విలువలు  మనిషి వ్యక్తిత్వాన్ని  వ్యక్తం చేస్తాయి. అందుకే విలువలను ఎప్పటికీ వదలకూడదు.  ఇతరుల పట్ల మంచిగా ఉండటం,  ఇతరులను గౌరవించడం,  ఇతరులకు సహాయం చేయడం,  ప్రేమ,  జాలి, కరుణ, దయ వంటివి ఉండటం.. ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వాన్ని,  సెల్ఫ్ రెస్పెక్ట్ ను పోగొట్టుకోకుండా పాటించినప్పుడు ఆ వ్యక్తి ఎంతో హుందాగా,  గొప్పగా అనిపిస్తాడు. ఇతరులకు ఇచ్చే గౌరవం, మర్యాద మన గౌరవాన్ని పెంచుతాయి. నమ్మకం, అపనమ్మకం.. మనిషి జీవితం నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.  తరువాత నిమిషం ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది కూడా చాలామందికి స్పష్టంగా తెలియదు. అలాంటప్పుడు మనుషులను,   పరిస్థితులను నమ్మకం అనే ఒక తాడులో బంధించి ఆ తరువాత దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎప్పుడు తెగిపోయినా దానిదే తప్పని, ఇతరులదే తప్పని అనడం ఆ వ్యక్తిదే నిజమైన తప్పు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా దానిని ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉండాలి. అంతేకానీ నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా బాధలలోకి జారిపోకూడదు.                                         *రూపశ్రీ.  
  ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు.  ఆయన చెప్పిన నీతి శాస్త్ర విషయాలు ఇప్పటికీ ఆచరించదగినవి. నీతి శాస్త్రంలో జీవితంలో అన్ని విషయాలకు పరిష్కారాన్ని అందించడం ఆచార్య చాణక్యుడికే చెల్లింది. చాణక్యుడు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు.  ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతిని ఇప్పటికీ ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు.    చాలావరకు శత్రువులు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.  ఇలా ఇబ్బంది పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవాలని ఉన్నా ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలకు ప్రధాన కారణం శత్రువు. ముఖ్యంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ప్రవేశిస్తాడు. ఎంతలా  ఎన్ని కారణాలుగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెడతాడు కూడా. అయితే ఇలా ఇబ్బందులు పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆచార్య చాణక్యుడి నీతిని పాటించడం సరైన పరిష్కారంగా పనిచేస్తుంది. శత్రువు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే మొదట చేయాల్సిన పని శత్రువు గురించి తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.  శత్రువు ఎవరైనా సరే.. ఆ శత్రువు బలవంతుడా లేదా బలహీనుడా అనే విషయం తెలుసుకోవాలి.  ఆ శత్రువు బలం,  బలహీనత ఆధారంగా ఒక వ్యూహం  రచించాలి.  ఆ వ్యూహాన్ని అనుసరించే ముందడుగు వేయాలి.  అలా చేస్తే శత్రువు మీద విజయం సాధించగలుగుతారు.  అయితే శత్రువు మీద విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే. సహనం,  సంయమనం.. చాలా సార్లు ప్రజలు కోపంగా ఉండి తమ శత్రువుపై నేరుగా దాడి చేస్తారు. కానీ చాణక్యుడి ప్రకారం శత్రువును ఓడించడానికి సంయమనం,  సహనం అవసరం. పరిస్థితి ఏమైనప్పటికీ,  ఓర్పు,  సంయమనం పాటించాలి.  సరైన సమయంలో  తదుపరి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. శత్రువును అయోమయంలో ఉంచాలి.. శత్రువును ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే శత్రువుకు మీ ప్రణాళికలు,  ఉద్దేశాల గురించి తెలిస్తే వారు  మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. కాబట్టి వారికి తగిన  బుద్ధి చెప్తూనే  ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి.                                          *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చేసరికి మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. చెమట ద్వారా శరీరం నుండి చాలా నీరు పోతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తగినంత నీరు తాగరు, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఒక సాధారణ మనిషి రోజుకు ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్న చాలా మందికి గందరగోళం కలిగిస్తుంది. వైద్యులు కూడా నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు.  వేసవిలో ఎంత నీరు తాగాలి అనే విషయం తెలుసుకుంటే చాలా మంది చాలా సమస్యల నుండి బయటపడతారు.  ఇంతకీ వేసవిలో ఎన్ని నీరు తాగాలి తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అంటే ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలి. అయితే, ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం,  ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.  ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా శారీరకంగా కష్టతరమైన పని చేస్తే ఎక్కువ నీరు త్రాగవలసి ఉంటుంది. అలాగే వేడి వాతావరణంలో నివసించే ప్రజలు ఎక్కువ నీరు త్రాగాలి. తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు.. నీరు మన శరీరానికి ఇంధనం లాంటిదని అందరికీ తెలుసు. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, ఇవి చిన్న సమస్యల నుండి ప్రారంభమై తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఆ సమస్యలు ఏంటంటే.. డీహైడ్రేషన్.. నీరు లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. చాలా సార్లు డీహైడ్రేషన్ కారణంగా మూర్ఛపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే  ప్రతి వ్యక్తి వేసవి కాలంలో ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. జీర్ణ సమస్యలు.. జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు త్రాగడం వల్ల మలబద్ధకం రావడం చాలా సాధారణం. అదనంగా గ్యాస్, ఉబ్బరం,  అజీర్ణం వంటి పొట్ట సమస్యలు కూడా పెరగవచ్చు. మూత్రపిండాలపై ప్రభావం.. మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. మూత్రపిండాల పనితీరులో  నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర ఇన్ఫెక్షన్ల  ప్రమాదం పెరుగుతుంది.  దీనిని నివారించడానికి, జుకు 2-3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
శరీర బలం చాలా వరకు  ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎముకలు  మన అవయవాలకు లోపల  బయటి నుండి రక్షణ కల్పిస్తాయి. కానీ చాలా మందికి ఉండే ఒక తప్పుడు  అలవాటు  ఎముకలను బలహీనపరుస్తుందని  తెలుసా? నిజం ఆ ఒక్క తప్పు వల్ల  శరీరానికి అవసరమైనంత కాల్షియం తీసుకున్నా సరే.. అది స్పాంజ్ నీటిని పీల్చేసినట్టు.. ఆ ఒక తప్పు శరీరంలో కాల్షియంను పీల్చుకుని ఎముకలను పెళుసుగా మారుస్తాయి. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసుకుంటే.. సూర్యకాంతి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపానికి ప్రధాన కారణం ఎండలో బయటకు వెళ్లకపోవడమే.  ఎండలో కూర్చోవడం వల్ల  శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో కాల్షియంకు ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రోజూ ఉదయాన్నే  కొద్దిసేపు సూర్యుడి లేత కిరణాలు ఉన్నప్పుడు ఆ ఎండలో కనీసం 10 నుండి 30 నిమిషాలు గడపాలి. సూర్యకాంతి,  విటమిన్ డి.. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ముఖ్యమైనది.  ఈ విటమిన్-డి  అవసరాన్ని తీర్చడానికి,  కొంత సమయం ఎండలో కూర్చోవడం ముఖ్యం.సూర్యకాంతి శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ పై పడినప్పుడు అది  శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-డి అదే శరీరంలో తయారు అవుతుంది.  ఇలా విటమిన్-డి తయారు కాకపోతే.. విటమిన్-డి లోపం ఏర్పడి శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎండలో కూర్చోవడం తప్పనిసరి.. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు,   ఉష్ణోగ్రత పెరగుదల ఎక్కువ ఉంది.  ఖచ్చితంగా ఉదయం సూర్యరశ్మిని శరీరానికి సోకేలా ప్లాన్ చేసుకోవాలి.  ఎందుకంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల  విటమిన్ డి లోపంతో బాధపడవచ్చు. సూర్యకాంతికి ఏ  సమయం  మంచిది? ఆరోగ్య నిపుణులు ఉదయం 10 గంటల లోపు,  సాయంత్రం 4 గంటల తరువాత నుండి 6 గంటల వరకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి బాగా పనిచేస్తుంది. ఇది విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది. ఎంత సమయం.. ప్రతి రోజూ సూర్యరశ్మి కనీసం 15 నుండి 30 నిమిషాలు శరీరానికి సోకేలా చూసుకోవాలి.  తీవ్రమైన ఎండ చర్మాన్ని దెబ్బతీస్తుంది.  కాబట్టి లేత సూర్య కిరణాలు మాత్రమే శరీరానికి మేలు చేస్తుంది.                                *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది.  రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు.  రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం... ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది  శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం. పొడిబారడం.. ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం  కూడా  తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. నల్ల మచ్చలు.. ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే  రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు. మొటిమలు రక్తం లేకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.                                       *రూపశ్రీ.