వేసవిలో రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? తెలుసుకోకుంటే నష్టపోతారు..!
posted on Apr 1, 2025 9:30AM
.webp)
వేసవి కాలం వచ్చేసరికి మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. చెమట ద్వారా శరీరం నుండి చాలా నీరు పోతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తగినంత నీరు తాగరు, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఒక సాధారణ మనిషి రోజుకు ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్న చాలా మందికి గందరగోళం కలిగిస్తుంది. వైద్యులు కూడా నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. వేసవిలో ఎంత నీరు తాగాలి అనే విషయం తెలుసుకుంటే చాలా మంది చాలా సమస్యల నుండి బయటపడతారు. ఇంతకీ వేసవిలో ఎన్ని నీరు తాగాలి తెలుసుకుంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అంటే ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలి. అయితే, ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా శారీరకంగా కష్టతరమైన పని చేస్తే ఎక్కువ నీరు త్రాగవలసి ఉంటుంది. అలాగే వేడి వాతావరణంలో నివసించే ప్రజలు ఎక్కువ నీరు త్రాగాలి.
తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు..
నీరు మన శరీరానికి ఇంధనం లాంటిదని అందరికీ తెలుసు. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, ఇవి చిన్న సమస్యల నుండి ప్రారంభమై తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఆ సమస్యలు ఏంటంటే..
డీహైడ్రేషన్..
నీరు లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. చాలా సార్లు డీహైడ్రేషన్ కారణంగా మూర్ఛపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి వ్యక్తి వేసవి కాలంలో ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి.
జీర్ణ సమస్యలు..
జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు త్రాగడం వల్ల మలబద్ధకం రావడం చాలా సాధారణం. అదనంగా గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి పొట్ట సమస్యలు కూడా పెరగవచ్చు.
మూత్రపిండాలపై ప్రభావం..
మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. మూత్రపిండాల పనితీరులో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. దీనిని నివారించడానికి, జుకు 2-3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...