Publish Date:Mar 9, 2019
Publish Date:Mar 5, 2019
Publish Date:Mar 2, 2019
Publish Date:May 22, 2015
Publish Date:May 16, 2015

EDITORIAL SPECIAL
  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
ALSO ON TELUGUONE N E W S
  'బాహుబలి' సినిమాకి ముందు ప్రభాస్.. టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో మాత్రమే. పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్ల తర్వాతే అతని పేరు ఉండేది. కానీ యస్.యస్. రాజమౌళి ఏ ముహూర్తాన 'బాహుబలి'గా ప్రభాస్‌ను ఊహించుకున్నాడో, అ క్షణాన ప్రభాస్ దశ తిరిగింది. అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, వేరే ధ్యాస లేకుండా 'బాహుబలి'గా విశ్వరూపమే ప్రదర్శించాడు ప్రభాస్. ఆ మూవీతో దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అభిమాన సందోహాన్ని సంపాదించుకున్నాడు.  ఒక తెలుగు నటుడికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ రావడం ఇదివరకు మనమెన్నడూ చూడలేదు. 'బాహుబలి: ద బిగినింగ్' వేసిన ఫౌండేషన్‌తో 'బాహుబలి: ద కంక్లూజన్'తో మరింత రెచ్చిపోయాడు ప్రభాస్. ఇక ఆ సినిమాతో ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ప్రభాస్ మేనియాతో ఊగిపోయారు. ఆరడుగుల విగ్రహం వుండేవాళ్లు చాలామందే ఉంటారు. దానికి గ్లామరస్ లుక్ కూడా తోడైతే.. ఒక హీరో ఎలా ఉంటాడనేందుకు ట్రూ ఎగ్జాంపుల్‌గా నిలిచాడు ప్రభాస్. 'బాహుబలి 2' మూవీ వసూళ్ల సునామీతో అదివరకటి హిందీ సినిమాల రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించడం నిజంగా ఒక ఫినామినా.  టాలీవుడ్‌లో ఎంతమంది మహా మహా స్టార్లు ఉండనీ గాక.. వాళ్లెవరూ చెయ్యలేని పని ప్రభాస్ చేశాడు. అది.. బాలీవుడ్‌లో సవాలే లేకుండా సాగుతున్న ఖాన్ త్రయం హవాని నిలువరించడం! వాళ్ల అధిపత్యానికి గండికొట్టాడు ప్రభాస్. సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌కు కూడా సాధ్యం కాని ఫీట్‌ను ప్రభాస్ సాధించాడు. గతంలో హిందీలో రజనీకాంత్, కమల్ హాసన్ కొన్ని సినిమాలు చేశారు. తెలుగు నటుల విషయానికొస్తే.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అక్కడ వాళ్లెవరూ స్టార్లు కాలేకపోయారు. కానీ అప్పటిదాకా ఎవరి ఊహకు కూడా అందని ప్రభాస్.. ఆ ఘనతను సాధించాడు. అందరు స్టార్లూ అసూయపడేంత కీర్తి సంపాదించాడు.  'బాహుబలి' సినిమాలు సృష్టించిన ప్రభంజనం ఘనతను చాలామంది రాజమౌళికే ఆపాదించి, ప్రభాస్ ప్లేస్‌లో ఎవరున్నా ఆ సినిమాలు ఆ రికార్డుల్ని సాధించేవేనని అతన్ని తక్కువచేసి మాట్లాడటం మనకు తెలుసు. కానీ వాళ్లది తప్పుడు అభిప్రాయమని 'సాహో'తో నిరూపించాడు ప్రభాస్. ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ ఎవరో తెలుగు ప్రేక్షకులకే సరిగా తెలీదు. దేశంలోని మిగతా సినీ ప్రియులకైతే పరిచయమే లేదు. 'సాహో' మూవీతోటే సుజిత్ ఎవరో ప్రపంచానికి తెలిసింది. 'సాహో' తెలుగునాట ఆశించిన రీతిలో ఆడలేదు. బయ్యర్లు నష్టపోయారు.  కానీ నార్త్ బెల్ట్‌లో 'సాహో' చేసిన వీరవిహారం చూసి బాలీవుడ్ స్టార్లు కళ్లు తేలేశారు..  తరణ్ ఆదర్శ్ లాంటి పేరుపొందిన బాలీవుడ్ విశ్లేషకుడు 'అన్‌బేరబుల్' అంటూ 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చి 'సాహో'ను దారుణంగా విమర్శించాడు. అలాంటివాడు 'సాహో' హిందీ వెర్షన్ సూపర్ హిట్టవడం చూసి బిత్తరపోయాడు. క్రిటిక్స్ అంతా చెత్త అని తేల్చేసిన 'సాహో'.. హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే ఇండియాలో 100 కోట్ల రూపాయల్నీ, ఓవరాల్‌గా 142 కోట్ల రూపాయల్నీ రాబట్టి ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజిలో ఉందో చాటి చెప్పింది.  అప్పటిదాకా 'సాహో'ను విమర్శించినవాళ్లే, 'ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్' అని ప్రశంసల జల్లు కురిపించారు. నిజమే. రిలీజ్‌కి ముందు 'సాహో'లో పెద్ద కథేమీ లేదని స్వయంగా ప్రభాసే చెప్పాడు. యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా ఉంటాయని చెప్పాడు. కానీ ఆడియెన్స్ 'సాహో'ను చూసింది కథ కోసమూ కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ కోసమూ కాదు.. కేవలం ప్రభాస్ కోసం! యస్.. ప్రభాస్‌ని చూడాలనే తహతహతోటే నార్త్ ఇండియాలోని మారుమూల ప్రాంతాల ప్రేక్షకులు 'సాహో' ఆడుతున్న థియేటర్లను హౌస్‌ఫుల్ చేశారు. 'సాహో' తెలుగునాట చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించకపోవచ్చు గాక.. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది.. 'బాహుబలి' రెండు సినిమాలు సాధించిన రికార్డుల్లో రాజమౌళితో పాటు, ప్రభాస్‌కూ క్రెడిట్ ఇవ్వాల్సిందేనని. 'సాహో'కు వచ్చిన క్రేజ్, హిందీలో ఆ సినిమా సాధించిన కలెక్షన్‌తో అసలు సిసలు పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా రూపాంతరం చెందాడు ప్రభాస్. ప్రస్తుతం ఏ బాలీవుడ్ స్టార్ కూడా పాన్ ఇండియా స్టార్ కాదు.  సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ స్టార్లు.. సౌత్ ఇండియాలో స్టార్లు కారు. ఆ విషయం ఇటీవలి 'వార్' మూవీతో తేటతెల్లమైంది. బాక్సాఫీస్ దగ్గర 'వార్' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీగా రికార్డులు సృష్టించింది. ఇద్దరు టాప్ యాక్షన్ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.. అందులో నటించారు. కానీ ఆ మూవీ తెలుగు వెర్షన్ ఆరేడు కోట్ల రూపాయలని మించి వసూలు చేయలేకపోయింది. తాజాగా 'వార్' సినిమాకు సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారనీ, అందులో ప్రభాస్‌ను ఓ హీరోగా నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనీ ప్రచారంలోకి వచ్చింది. కారణం.. హృతిక్‌తో పాటు ప్రభాస్ కూడా నటిస్తే.. ఆ సినిమా రేంజి.. వేరే లెవల్లో ఉంటుందనేది నిర్మాతల ఆలోచన అని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ ఆ సినిమా చేస్తే, తెలుగునాటే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వస్తుందనీ, అది కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందనీ నిర్మాతలు భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల మాట. అందులో నిజం ఉండనీ, లేకపోనీ.. ప్రభాస్ రేంజి ఏ లెవల్‌కు వెళ్లిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ఇవాళ.. ప్రభాస్. ద ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సూపర్ స్టార్! భవిష్యత్తులో కెరీర్ పరంగా అతను మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకుంటాడని ఆశిద్దాం. విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే టు ప్రభాస్! (అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు) - యజ్ఞమూర్తి
'బాహుబలి' కాకుండా గత నాలుగైదు ఏళ్లలో అనుష్క నటించిన సినిమాల్లో గుర్తుపెట్టుకోదగ్గది, బాగా విజయవంతమైనది ఏదైనా ఉందంటే అది 'భాగమతి' చిత్రమే. అది ఫలానా జోనర్ సినిమా అని చెప్పలేం. హారర్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ... సినిమాలో అన్నీ ఉన్నాయి. ప్రతి పావుగంటకు, అరగంటకు జోనర్ మారుతుంది. ఈ కాన్సెప్ట్, స్టోరీ సెటప్ హిందీ ఇండస్ట్రీలో ఓ నటుడికి బాగా నచ్చింది. అతడు ఎవరనేది ఇంకా తెలియలేదు గాని, 'భాగమతి'ని హిందీలో రీమేక్ చేయడానికి చకచకా పావులు కదుపుతున్నాడని తెలిసింది. తెలుగు 'భాగమతి'కి దర్శకత్వం వహించిన అశోక్, హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారు. 'భాగమతి'గా అనుష్క నట విశ్వరూపం చూపించింది. 'ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. భగ భగ భాగమతి' డైలాగ్స్ చెప్పే సన్నివేశంలో అయితే అనుష్కను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తెలుగులో అనుష్క ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది. హిందీలో అనుష్క పాత్రను భూమి పెడ్నేకర్ చేయనున్నారు. మిగతా పాత్రలకు సెలక్షన్ జరుగుతోంది.
పవన్ కల్యాణ్ దగ్గర మైత్రీ నిర్మాతల అడ్వాన్స్ ఉంది. ఒక్క సినిమాకు 40 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తారట. ఇక పోతే 'రెబల్' నిర్మాతలు జె భగవాన్ రావు, జె. పుల్లారావ్ అడ్వాన్స్ ఉంది. అలాగే, దిల్ రాజుకు ఓ సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారట. వీళ్లు కాకుండా త్రివిక్రమ్ తో వరసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అడ్వాన్స్ కూడా పవన్ దగ్గర ఉందని సమాచారం. రాజకీయాల్లోకి వెళ్లే ముందు, వెళ్ళిన తరువాత మళ్లీ సినిమాలు చేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు‌. సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. పవన్ సినిమా వస్తానంటే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలే కాదు... మిగతా నిర్మాతలు కూడా అంత రెమ్యూనరేషన్ కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, దర్శకుడు ఎవరనేది క్వశ్చన్ మార్క్. పింక్ రీమేక్ లో పవన్ నటిస్తారని వార్తలు వస్తున్నా... రీ ఎంట్రీ సినిమా మాత్రం అది కాదని సమాచారం. ఇటీవల పవన్ ను కలిసిన హరీష్ శంకర్ ఒక కథ వినిపించాడట. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లో ఆ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అలాగే, దర్శకుడు క్రిష్ కూడా పవన్ ని కలిసి ఒక కథ చెప్పారని టాక్. ఇకపోతే త్రివిక్రమ్ కూడా తమ్ముడు కోసం ఒక కథ రెడీ చేసాడట. త్రివిక్రమ్... హరీష్... ఇద్దరిలో ఎవరో ఒకరి దర్శకత్వంలో పవన్ సినిమా చేయవచ్చని తెలుస్తుంది.
ఇక్కడ బెల్లంకొండ అంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాదు. అతడి తమ్ముడు గణేష్. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు. పవన్ సాధినేని దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. ముగ్గుర్నీ ఎంపిక చేసేశారు. బెల్లంకొండ గణేష్ కు జోడీగా 'మజిలీ'లో నాగచైతన్య కుమార్తెగా నటించిన అనన్య అగర్వాల్, 'హుషారు', తేజ దర్శకత్వంలో 'హోరాహోరీ'లో నటించిన దక్షా నాగర్కర్, నటాషా నటించనున్నారు. మొదట్లో కొంచెం క్రేజ్ ఉన్న కథానాయికలను తీసుకోవాలని ప్రయత్నించారు. కొత్త హీరో, హిట్ దర్శకుడు కాకపోవడంతో వాళ్ళందరూ ఆలోచించారు. ప్రస్తుతానికి బెల్లంకొండకు హీరోయిన్ల సమస్య తీరింది. కానీ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మొదటి సినిమా 'అల్లుడు శీను'లో హీరోయిన్ గా నటించిన సమంత రేంజ్ వీళ్లకు లేదు. అందులో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. ఇందులో ఎవరు చేస్తారో ఇంకా తెలియదు. కథపై నమ్మకంతో కొత్త హీరోయిన్లను తీసుకున్నారని అనుకున్నా... సినిమాకు ఈ ముగ్గురు హీరోయిన్లు ఏమాత్రం క్రేజ్ తీసుకొస్తారనేది చూడాలి.
  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ 'అల.. వైకుంఠపురములో' క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే 'సామజవరగమన' సాంగ్ యూట్యూబ్‌లో తెలుగు సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టగా, లేటెస్టుగా రిలీజ్ చేసిన రెండో సాంగ్ 'రాములో రాములా' టీజర్ నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సాధిస్తూ ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపిస్తోంది. ఈ మూవీకి తమన్ కూర్చిన స్వరాలు మ్యూజిక్ లవర్స్‌ని ఒక ఊపు ఊపేస్తున్నట్లే కనిపిస్తోంది. నిజానికి మొత్తం పాటలు వచ్చాకే ఈ మాట చెప్పాలి. కానీ ఒక వంటకం రుచిని తెలుసుకోవాలంటే, మొత్తం తినాలా.. శాంపిల్ చూస్తే సరిపోతుందిగా.. అన్నట్లు ఫస్ట్ సాంగ్ 'సామజవరగమన'తోటే 'అల వైకుంఠపురములో' మ్యూజిక్‌ని తమన్ ఏ లెవల్లో కొడుతున్నాడో అర్థమైంది.  సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో చక్కగా రాసిన ఆ పాటని సిద్ శ్రీరాం ఖూనీ చేసి పాడినా, అది బ్లాక్‌బస్టర్ హిట్టవడానికి కారణం.. తమన్ ఇచ్చిన ట్యూన్స్ మహిమే అనేది నిజం. ఆదిత్యా మ్యూజిక్ రిలీజ్ చేసిన ఆ పాటకు 4 కోట్లకు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఏ తెలుగు పాటకు సంబంధించి చూసుకున్నా ఇది రికార్డని నిర్మాతలు ప్రకటించారు. తాజాగా తెలంగాణ జానపద శైలి పాటలు రాయడంలో స్పెషలిస్టయిన కాసర్ల శ్యామ్ రాసిన 'రాములో రాములా నన్నాగం జేసిందో.. రాములో రాములా నా పాణం దీసిందిరో..' అంటూ నడిచే పాటకు సంబంధించిన టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ మంగళవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు యూట్యూబ్‌లో విడుదల జేసింది. క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అయిపోయింది. గంట తిరిగేసరికల్లా దానికి 4 లక్షల 80 వేల వ్యూస్, 60 వేలకు మించి లైక్స్ వచ్చాయంటే.. ఈ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలకు నిదర్శనమని చెప్పాలి. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి పాడిన ఈ పాట ఫుల్ వెర్షన్‌ను దీపావళి ముందు రోజు.. అంటే అక్టోబర్ 26న రిలీజ్ చేయనున్నారు. టీజర్‌లో కేవలం అనురాగ్ వాయిస్ మాత్రమే వినిపించింది. మంగ్లీ వాయిస్‌ను వినాలంటే 26వ తేదీ దాకా ఆగాలి. తెలంగాణ ఫోక్ స్టైల్‌లో వినిపిస్తున్న ఈ సాంగ్‌ను సినిమాలో ఏదో వేడుక సందర్భంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డేని ఉద్దేశించి బన్నీ ఈ పాట పాడుతున్నట్లు ఊహించవచ్చు. అయితే ఆ ఇద్దరితో పాటు టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్, మురళీశర్మ సైతం డాన్స్ చేస్తున్నారు. బన్నీ-పూజా, టబు-జయరామ్, సుశాంత్-నివేదా జంటలుగా కనిపిస్తున్నారు. మంచి లైటర్ మూమెంట్‌లో ఈ సాంగ్‌ను అల్లు అర్జున్, పూజా హెగ్డే పాడుతున్నారని తెలుస్తోంది. బహుశా అది సుశాంత్, నివేదా జంటకు సంబంధించిన వేడుక కావచ్చనిపిస్తోంది. ఒక సాంగ్ టీజర్‌కే ఈ రకమైన పిచ్చిని అభిమానులు చూపిస్తున్నారంటే, రేపు 26న మొత్తం పాట వచ్చాక, దానికి ఎంతటి ఆదరణ లభిస్తుందనేది ఊహాతీతం. వచ్చే సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' మూవీ విడుదలవుతోంది. ఈ లోపు తన మ్యూజిక్‌తో ఆ సినిమాకి ఒక ఊపును తీసుకొస్తున్నాడు తమన్. ఇది త్రివిక్రమ్ తో అతనికి రెండో సినిమా. ఇదివరకు 'అరవింద సమేత.. వీరరాఘవ' సినిమాకు ట్యూన్స్ కట్టాడు తమన్. ఆ మూవీ సాంగ్స్ సూపర్ పాపులర్ అవడంతో మరోసారి ఈ సినిమాతో అతనికి ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. రెండు చేతులా ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని సూపర్ ట్యూన్స్‌తో అలరిస్తున్నాడు తమన్. రానున్న రోజుల్లో 'అల వైకుంఠపురంలో' సాంగ్స్ ఏ రీతిన పాపులర్ అయ్యి, సినిమాకి ఏ రేంజ్ క్రేజ్‌ను తీసుకొస్తాయో చూడాలి.
  యువకుడు... పైగా అనుభవం లేదు... మరోవైపు శివసేన పోరు... ఇంకోవైపు సీనియర్ల ఆధితప్యం... ఇన్ని అడ్డంకులు అవరోధాల మధ్య... ప్రభుత్వాన్ని నడపడం అతనికి చేతగాదని అంచనా వేశారు. ముఖ్యంగా శివసేన పోరు పడలేక మధ్యలోనే పారిపోతాడని లెక్కకట్టారు. విపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. కానీ, వారందరి అంచనాలను దేవేంద్రుడు తలకిందులు చేశాడు. ప్రాంతీయ పార్టీల అధినేతల మాదరిగా మరాఠా ప్రజలపై బలమైన ముద్ర వేశాడు. ఒక్క అవినీతి మరకా అంటకుండా పరిపాలన సాగించాడు. ఎలాంటి సమస్య వచ్చినా ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొని పరిష్కరించాడు. అంతేకాదు పక్కలో బల్లెంలా మారిన శివసేనను సైతం దారిలోకి తెచ్చుకుని రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. అందుకే మహారాష్ట్ర ప్రజలు మళ్లీ దేవేంద్రుడికే పట్టం కట్టారని ఎగ్టిట్ పోల్స్ అన్నీ తేల్చిచెప్పాయి.    ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లు బీజేపీకి ఆయువుపట్టుగా నిలిచాయని ఎగ్జిట్ పోల్స్ లెక్కగట్టాయి. మహారాష్ట్ర జనాభాలో 30శాతమున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ అత్యంత సాహసంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో... మెజారిటీ మరాఠాల ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని తేల్చాయి. అందుకే, మరాఠా కాంగ్రెస్‌ పార్టీగా చెప్పుకునే, ఎన్సీపీని సైతం పక్కనపెట్టి మరాఠాలంతా ఏకపక్షంగా బీజేపీకి సై అన్నారని సర్వే సంస్థలు అంటున్నాయి. ఇక, మోడీ-షా మాయాజాలం ఎలాగూ ఉంటుంది. అలాగే బీజేపీకి పేటెంట్ గా మారిన జాతీయవాదం, హిందూత్వం కూడా మరోసారి మహారాష్ట్ర పీఠం దక్కించుకునేందుకు దోహదపడబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను... మరోసారి మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. రాహుల్ అధ్యక్ష పీఠం దిగినా, సోనియా అధిరోహించినా, కాంగ్రెస్‌పై ఏమాత్రం సానుభూతి చూపలేదని తెలుస్తోంది. అలాగే, ఎన్సీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌ను మాత్రం మరాఠాలు చేరదీయలేదని అంచనా వేశాయి.
  అవశేష ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఆవిర్భావ దినోత్సవం నిర్వహించకుండా, నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేసిన విభజనతో ఆంధ్రులు తీవ్రంగా నష్టపోయారంటూ విభజన బాధలను ప్రజలు గుర్తుతెచ్చుకునేలా ఆరోజు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఇఫ్పుడు ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ మొదలైంది. అయితే, రాష్ట్ర విభజనతో జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో ప్రతి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భావ దినోత్సవాలకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు... ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడింది. అలాగే విస్తృత చర్చలు జరిపింది. చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయానికి వచ్చిందట. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన దినాన్ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం అంత సరైనది కాకపోయినా... తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. ఈ రెండు తేదీలను కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, జగన్ ప్రభుత్వం ఏ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుందో చూడాలి. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా... ముందుగా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు తావు లేకుండా ఉంటుందని అంటున్నారు.
  ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి  సర్వత్రా నెలకొంది.  మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇక పైన అయినా పోలవరంలోని పనులు జోరందుకుంటాయో లేదో వేచి చూడాలి.
  తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది.  తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.
చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్‌ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.
  ఏం జరగబోతోందో అన్న అనుమానమే భయానికి దారితీస్తుంది అంటారు పెద్దలు. మనలో ఏర్పడే భయాలు కొంతవరకూ సహేతుకమే కావచ్చు. ప్రమాదాల నుంచి పరాజయాల నుంచి మనల్ని కాపాడవచ్చు. కానీ చీటికీ మాటికీ భయపడుతూ కూర్చుంటే జీవితమే ఒక జాగ్రత్తగా మారిపోతుంది. అందుకనే భయాలను దాటినవారికే విజయం లభిస్తుందని చెబుతుంటారు నిపుణులు. మరి ఆ భయాలను దాటేందుకు వారు ఇచ్చే సలహాలు...   భయాన్ని పసిగట్టండి మెదడులో అసంకల్పితంగా ఏర్పడే భయం తన ప్రభావాన్ని శరీరం మీద చూపి తీరుతుంది. ఆ లక్షణాలను పసిగట్టే ప్రయత్నం చేస్తే... మనలో ఉన్న భయం అవసరమా కాదా అని తర్కించే అవకాశం దొరుకుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల దిమ్మెక్కిపోవడం, చెమటలు పోయడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది... లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే, వాటికి భయమే కారణమేమో గమనించాలి.   అలవాటు చేసుకోండి ఇదివరకు ఎప్పుడూ చేయని పని అనుమానానికి దారితీస్తుంది. ఆ ఆనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి మీకు భయం కలిగిస్తున్న పనిని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భయం నిర్హేతుకం అని తేలిపోతుంది. పరీక్షలంటే భయముంటే మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి, కొత్త వ్యక్తులను కలవడంలో భయం ఉంటే చొరవగా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి.   భయపడే పని చేసేయండి ఒక పని చేయాలంటే మీకు చాలా భయం. కానీ ఆ పని విజయవంతం అయితే మీ జీవితమే మారిపోతుందని తెలుసు! అలాంటప్పుడు భయపడుతూ కూర్చుంటే లాభం లేదు కదా! ఒక్కసారి గుండెని అదిమిపట్టి అనుకున్న పనిని చేసేయండి. శరీరాన్ని ముందుకు దూకించండి. ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం. కానీ ఫలానా కంపెనీలో మీలాంటివారికి ఉద్యోగం ఉందని తెలిసింది. వెంటనే మీ రెజ్యూమ్ని తీసుకుని ఆఫీసుకి చేరిపోండి. ఆ తర్వాత ఎలాగూ ఇంటర్వ్యూని ఎలాగూ ఎదుర్కోక తప్పదు.   తాత్సారంతో లాభం లేదు భయపడే పనిని వాయిదా వేసి, ఆ భయం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా పని మరింత క్లిష్టతరం అయిపోతుంది. దాంతో భయమూ అంతకంతకూ పెరిగిపోతుంది. కాబట్టి వాయిదా వల్ల హాని తప్ప ఉపయోగం లేదు. అందుకనే అనుకున్న పని పూర్తిచేయడానికి కొన్ని నిర్దిష్టమైన డెడ్లైన్స్ పెట్టుకోండి. పని చేయబోతున్నానని ఇతరులతో ఒప్పేసుకోండి. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాధ్యతని తలకెత్తుకోండి.   చిన్నపాటి టెక్నిక్స్ పాటించండి భయాన్ని ఎదుర్కోవడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. వాటిలో మీకు అనువుగా ఉండేదాన్ని ఎన్నుకోండి. ఊపిరి నిదానంగా పీల్చుకుని వదలడం, ఉద్వేగంతో బిగుసుకుపోయిన కండరాల మీద ధ్యాస నిలపడం... లాంటి చిట్కాలు చాలావరకూ సాయపడతాయి. - నిర్జర.  
    'కాండిల్ లైట్ డిన్నర్' చేయటమంటే మీకిష్టమా. అదీ ఇంట్లో, కాని ఆ కొవ్వొత్తులని ఒకటి ఒకటి వెలిగించటం, అవి కరిగి ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద పడతాయో అన్న టెన్షన్ తో ఆ సరదాకి దూరంగా ఉంటున్నారా, అయితే 'లెడ్ ఫ్లేమ్ లైట్' లని తెచ్చుకోండి ఇంటికి. అగ్గిపుల్లతో వేలిగించనక్కర్లేదు, కరిగే భయం ఉండదు. ముఖ్యంగా పొగరాదు, అదెలా అంటే? చూడడానికి కొవ్వొత్తులా ఉండే ఈ 'లెడ్ ప్లేమ్ లైట్ ' నిజానికి ఓ లైట్. అయితే దీనిని వేయడానికి స్విచ్ అవసరం లేదు. కొవ్వొత్తుని ఆర్పడానికి ఊదినట్లు ఊదితే వెలుగుతుంది. మళ్ళీ ఊదితే ఆరిపోతుంది. విచిత్రంగా వుంది కాదూ. రెండు చిన్న బ్యాటరీలతో పనిచేసే ఈ ప్లాస్టిక్ క్యాండిల్ ధర కూడా చాలా తక్కువే. ఇంటిని౦డా ఎంచక్కా అందానికి వీటిని అలకరించుకుని కావల్సినప్పుడు ఊదుతూ వెళ్ళటమే. 'బ్లో అన్ ఆఫ్ క్యాండిల్స్' ఎక్కడ దొరుకుతాయి అంటారా? మనస్సు పెట్టి ఆలోచించండీ.
  మీకు ప్రతిరోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? ప్రతిరోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ తాగేతే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ మోతాదుకు మించకుండా కాఫీ తాగితే రక్తనాళాలు సాగే గుణం మెరుగుపడుతుందని, అదే విధంగా గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి పరిశోధనలో తెలిసినది ఏమిటంటే... రోజుకి మోతాదు మించకుండా ఒకటి, రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటున్నట్లు తెలిపారు. దీనివలన నూతన ఉత్తేజం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొలిక్కొస్తుందా. కార్మికులు ప్రభుత్వం మధ్య సయోధ్య  కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయా. ఇరువర్గాలూ మెట్టు దిగడానికి అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి బస్ భవన్ వర్గాలు.ఇరువర్గాల మధ్య ఆర్టీసీ విలీనంపైనే పీటముడి నెలకొని ఉంది. విలీనానికి మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయితే మిగిలిన అంశాలకు అంగీకరిస్తే విలీనంపై కార్మిక సంఘాలు మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 28 నాటికి  సమస్య పరిష్కారం అవుతుందని హై కోర్టు ఆశాభావం వ్యక్తం చేసిన నేపధ్యంలో కమిటీ సంప్రదింపుల ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.కోర్టు ఉత్తర్వులు అందితే చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.కార్మికుల డిమాండ్ లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీ ఏర్పాటు చేసింది హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.రెండురోజుల్లో ఎండీకి నివేదిక ఇవ్వనుంది నిన్న దీని పై ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ హై కోర్టు ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.తక్షణమే వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.కార్మికులు మెట్టు దిగడానికి అవకాశం ఉందా విలీనం డిమాండ్ మినహాయిస్తే కార్మి కుల డిమాండ్ లో ప్రధానమైనవేంటి, కార్మికుల సమ్మె కు ఎలా ముగింపు పలకవచ్చని అంశాల పై ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది.మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె పంతొమ్మిదో రోజుకు చేరింది బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేపట్టారు.అఖిల పక్ష పార్టీ లు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నేతలు కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ కొద్ది సేపట్లోనే భేటీకానుంది బస్ భవన్ లో భేటీ అవుతుంది. కోర్టు సూచించినటువంటి కోర్టు డైరెక్ట్ చేసినటువంటి ఇరవై ఒక్క అంశాలు ముందుగా కార్మిక సంఘాలన్ని కలిసి టీఎంయూ ఆధ్వర్యంలో నలభై రెండు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.
  తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ సోకి పలువురు మృతిచెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. మనుషులు చనిపోతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. డెంగ్యూపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తెలిపింది.
  కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.బోటు వెలికితీయడంతో మృతుల కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. బోటు నుంచి వెలికితీసిన ఎనిమిది మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజుతో పాటు బోటులో ప్రయాణించిన వరంగల్ కు చెందిన పర్యాటకుడు కొమ్ముల రవీందర్ మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన ఆరు మృతదేహాలు ఎవరివన్నది నిర్ధారించాల్సి ఉంది. మొత్తం మృతదేహాల్లో ఒక్కటి మాత్రమే మహిళది. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వెలికితీసిన వశిష్ట బోటులో ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. బురదలో కూరుకుపోయి కొన్ని బోటు రేకులకు పట్టుకుని కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ బోటు ఏసీ క్యాబిన్ లో ఉన్నాయి. బోటు గల్లంతైన రోజునే గల్లంతయిన వాళ్లంతా ఏసీ క్యాబిన్ లో ఉండి ఉంటారని అనుమానించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని మృతదేహాలు అందులో చిక్కుకొని ఉన్నాయి. ఇవి ఎవరివో గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారిలో పన్నెండు మంది జాడ తెలియాల్సి ఉండగా ఇప్పటికే ఎనిమిది బయటపడటంతో మిగిలిన నలుగురి జాడ కోసం బోటు ఉన్న ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు.మృత దేహాలు బాగా కుళ్ళీపోయి ఉండటంటో ఎవరివో గుర్తించటం చాలా కష్టంగా మారింది. మృతుల బంధువులు కుటుంబ సభ్యుల రోదనలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాదకర వాతావరణం నెలకొంది.
  ఎగ్జామ్స్ టైం వస్తోందంటే చాలు పిల్లలు చదివి చదివి అలసిపోతారు. అలాంటి చిన్ని కళ్ళని మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. వాళ్ళు ఎక్కువగా చదవటం వల్ల వచ్చే ఒత్తిడిని కళ్ళు వెంటనే మనకి తెలియచేస్తాయని చెప్తున్నారు కంటి వైధ్యులు. అలా అలిసిపోయిన కళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాపాడుకోవచ్చట. పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళ గదిలో ఉండే గాలి వెలుతురుని అంతగా పట్టించుకోరు. తొందరగా చదివేసుకోవాలనే తపన తప్ప వాళ్ళకి ఇంకో ధ్యాస ఉండదు. తగినంత వెలుతురు లేని చోట చదవటం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందిట.   * ఏకధాటిగా చదివే సమయంలో కళ్ళనుంచి నీరు కారుతుంది. అలాంటి సమయంలో పల్చటి మజ్జిగలో తడిపిన దూదిని కళ్ళ మీద వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచినా చాలు. * నిద్ర లేవగానే ముందుగా కళ్ళ మీద చల్ల నీళ్ళని అయిదు నిమిషాల పాటు కొట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంత అలిసిపోయిన కళ్ళయినా సేద తీరుతాయి. * కళ్ళ మంటలు తగ్గాలంటే ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ ఉండాలి. అదే పనిగా ఎక్కువసేపు ఒకే వైపు చూస్తూ ఉండిపోకూడదని చెప్తున్నారు డాక్టర్లు. * అలిసిపోయిన కళ్ళకి ఫ్రిజ్ లో పెట్టి తీసిన టీ బాగ్స్ బాగా పనికొస్తాయి. అలా బయటకి తీసిన టీ బాగ్స్ ని కళ్లపై ఉంచుకుని కాసేపు అయ్యాక తీసి చల్ల నీళ్ళతో కళ్ళు కడిగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది. * కీరా దోసని గాని, బంగాళదుంపని గాని పల్చటి చక్రాలుగా తరిగి కళ్ల రెప్పలపై వేసి ఉంచినా కళ్ళు త్వరగా చల్లబడతాయి.   * అలసట వల్ల కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తే టమాటో గుజ్జులో చిటికెడు పసుపు, 1 స్పూన్ నిమ్మరసం,1 స్పూన్ సెనగపిండి వేసి ముద్దలా చేసి దానిని కనురెప్పలపై పూసి అరగంట తర్వాత కడిగేసుకుంటే బ్లాక్ సర్కిల్స్ తొందరగా మాయమవుతాయి. * రోజ్ వాటర్ కళ్ళకి మంచి మందులా పనిచేస్తుంది. రోజ్ వాటర్ లో దూది ముంచి దానిని కనురెప్పలపై వేసినా కళ్ల అలసట తగ్గుతుంది. * చదువుతూనే కళ్ళకి అప్పుడప్పుడు చిన్నపాటి ఎక్సరసైజ్ ని చేయిస్తూ ఉండాలి. ఐ బాల్స్ ని గుండ్రంగా తిప్పుతూ, కిందకి మీదకి,ఎడమవైపు కుడివైపు తిప్పుతూ ఉంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాగ్రత్తలతో పాటు కళ్ళకి మంచి ఆరోగ్యనిచ్చే ఆహారం కూడా తీసుకుంటే పిల్లల కళ్ళు దెబ్బతినకుండా ముద్దులొలుకుతూ ఉంటాయి. --కళ్యాణి  
    With the onset of the winter season the, climate becomes more harsh and dry mostly towards our skin. Skin being the most easily exposed, is most affected and its vital moisture and oils are snatched away! Your skin also needs moisturizing during the winter chills, so it is advisable to use oil-based creams; a wise choice is to be made among oils as certain clog facial pores. Avocado oil, mineral oil, primrose oil and almond oils are amongst the advisable oils! Just because it is not summer-time we need not put away the sunscreen lotions. They are very much needed during the winter also the sun and snow glare do the same damage to our skin as the hot sun does during summer. But the sunscreen with a lower SPF is advisable i.e., above 20 SPF! Try covering your limb extremities with woolens, start with cotton thermals and then switch to wool as wool may cause irritation. Wearing wet socks and gloves is most likely to invite problems; it flares up skin irritation and diseases like, itching, cracking and eczema. Most of us apply various peels and replenishing packs while, most of these masks, alcohol-based toners and astringents also evaporate the moisture from the skin. Instead of these masks it is advisable to use cleansing milk or foaming cleansers which are devoid of alcohol. When the temperature drops down, taking steaming hot baths feels great. But the saddening fact behind these super hot baths is that they break down the lipid barriers and the snatch away the moisture and making the skin all the more dry and life-less! Protect your skin and look stunning round the year! Take Care!! ......SIRI
  * నడక శరీరంలో ఎముకలు, కండరాలకు మెదడుతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. నడకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కండరాలు తరిగిపోతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే అలవాటు లేనివాళ్ళ శరీరంలో నిత్యం ఉపయోగించగలిగే కీళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఎక్కువశాతం కీళ్ళు బిగుసుకుపోతాయి. * బరువు తగ్గాలనుకునేవారు నడకకి వెళ్ళేముందు ఏమీ తినకూడదు. ఎందుకంటే, ఓ ముప్ఫై నిమిషాలపాటు నెమ్మదిగా నడవటానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి 45 శాతం, కొవ్వు నుంచి 65 శాతం విడుదలవుతుంది. అంటే నడుస్తుంటే మరింత శక్తి కావాలన్న సంకేతం అందుకున్న శరీరం కొవ్వు నిల్వల్ని కరిగిస్తుంది అన్నమాట. * నడక మంచిది అన్నారు కదా అని మొదలుపెడుతూనే వేగంగా నడవకూడదు. మొదట 5 - 10 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే ఏ వ్యాయామానికైనా కాసేపటికీ ముందు నుంచీ శరీరాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ వెళ్ళాలి. ఎంత వేగంగా నడవాలీ అంటే, నడుస్తూ కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడనంత వేగం మంచింది. అలాగే నడక ముగించేటప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రిలాక్సింగ్‌గా నడక ముగించాలి. * నిజానికి నడకతోపాటు కొన్ని వేరే వ్యాయామాలూ శరీరానికి అవసరం. ఎందుకంటే, నడక కొన్ని కండరాలపై ఎక్కువగానూ, కొన్ని కండరాలపై తక్కువగానూ ఒత్తిడి పడేట్ట చేస్తుంది. అందుకని వారంలో ఐదురోజులు నడిస్తే, రెండు రోజులు మీకు నచ్చిన వ్యాయామాలను చేయండి. ఈత, యోగా, ఏరోబిక్స్, జిమ్ ఇలా... * రోజూ నడిచే అలవాటు వున్నవారికి గుండె, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు 10 నుంచి 20 సంవత్సరాల పాటు వాయిదా పడితీరతాయి అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. * ఎంతసేపు నడవాలి? దీనికి పరిమితి లేదు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు అన్నది సూత్రం. కాబట్టి 24 నిమిషాలకు తగ్గకుండా వీలునుబట్టి, ఆరోగ్యాన్నిబట్టి ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చుకావాలని నడిచేవారు మాత్రం ఎంత దూరం నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని నడక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. * ఇక ఒకసారి నడవటం మొదలుపెట్టాక 12 వారాలపాటు అయినా కొనసాగించాలి. రెండు రోజులో మూడు రోజులో నడిచి మానేస్తే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా వుంటాయట. * చివరిగా ఒక్కమాట... క్రమం తప్పకుండా మూడు నాలుగు నెలలపాటు నడిస్తే ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇక అప్పుడు మానేద్దామన్నా మానలేరు. కాబట్టి ఒక్క నాలుగు నెలలపాటు ఓపికపట్టి నడిచారంటే ఇక ఆ తర్వాత ఆ నడకే మిమ్మల్ని ముందుకు నడిపించుకుని వెళ్తుంది. -రమ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.