ఆత్మహత్యకు ముందు హోంశాఖకి గురుప్రసాద్ లేఖ

 

తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి ముందు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. 498ఏ చట్టాన్ని (గృహహింస చట్టం) సవరించాలని లేఖలో కేంద్ర హోంశాఖను కోరారు. తన భార్య తనపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టిందని ఆయన వెల్లడించారు. తాను తన భార్యను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని గురుప్రసాద్ లేఖలో స్పష్టం చేశారు. గృహ హింస చట్టం వల్ల తనలాంటి అమాయకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గృహ హింస చట్టం కింద భర్త, సంబంధీకులపైనే కేసులు నమోదు అవుతున్నాయని, గృహహింస చట్టంకింద కేసు వల్ల పోలీసులు తనను వేధిస్తున్నారని వెల్లడించారు.