బాలకృష్ణ వాస్తు సలహా.. చంద్రబాబు ఇల్లు కూల్చుతారు..

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారనున్నారు. ఇప్పుడు ఆయన నివాసం ఉంటున్న జూబిలీ హిల్స్ ఇంటిని ఖాళీ చేసి లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ని అధికార నివాసంగా మార్చుకుని, అక్కడే నివాసం ఉండనున్నారు. అలాగే జూబిలీ హిల్స్‌లోని ఇంటిని కూల్చేసి ఆ స్థలంలో అధునాతన ఇంటిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఇంటిని 1999లో నిర్మించారు. ఈ ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మించాలన్న ఆలోచన నందమూరి బాలకృష్ణదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో బాలకృష్ణ వాస్తు మార్పులు చేశారు. అందువల్లే పార్టీ విజయం సాధించిందన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆయన సూచన మేరకే చంద్రబాబు ఇంటిని కూల్చివేసి అధునాతనంగా కొత్త ఇంటిని నిర్మించనున్నారని సమాచారం. ఆ ఇంటి నిర్మాణ పనులను నందమూరి బాలకృష్ణే పర్యవేక్షించనున్నారట.