తిరుమలలో తాచుపాము హల్ చల్.. కొత్త సంవత్సరంలో కంగారుపెట్టిన సర్పం

కొత్త సంవత్సరానికి తిరుమలలో ఓ నాగుపాము స్వాగతం చెప్పింది. బుసలు కొడుతూ ఊగిపోతున్న ఆ తాచుపామును చూసి భక్తులు భయకంపితులయ్యారు. బుధవారం (జనవరి 1) ఉదయం తిరుమల  రాంబగిచా గెస్ట్ హౌస్ దగ్గర ఓ తాచుపాము హల్ చల్ చేసింది.

దాదాపు ఆరు అడుగులు ఉన్న ఈ పాము బుసలు కొడుతూ ఊగిపోతుండటంతో భక్తులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతడు వెంటనే రంగంలోకి దిగి అతి కష్టం మీద ఆ తాచుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం జనంలో సందడిగా ఉండే రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్ద నాగుపాము హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.