అవసరమైతే పవన్ తో మాట్లాడుతా.. చంద్రబాబు
posted on Aug 28, 2015 1:08PM

ఏపీ రాజదాని కోసం రైతుల దగ్గర నుండి భూసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అటు జనసేనపార్టీ అధ్యక్షుడు.. ఇటు వైఎస్స్రాఆర్ పార్టీ అధినేత జగన్ ఇద్దరు తమ వ్యతిరేకతను చూపించారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ ను ఆపుకోని మరీ వచ్చి రైతలను పరామర్శించి వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. అయితే రైతల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. అవసరమైతే వారి ఇవ్వడానికి అంగీకరిస్తే తీసుకోండని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంలో భూసేకరణ కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైతే తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతానని స్పష్టం చేశారు. కొంతకాలంగా టీడీపీ పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.