కసిరెడ్డి సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందే.. స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనపై కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. 
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డే అన్నారు. అంతే కాదు ఆ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని కుండబద్దలు కొట్టారు. వైసీపీ నుంచి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకున్న తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో విచారణకు హాజరైన సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇప్పుడు ఆయన మాటలు అక్షర సత్యాలేననడానికి తాజాగా ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందే నంటూ హైకోర్టు విస్పష్టంగా చెప్పడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు.  

ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  తనకు విచారణకు హాజరు కావాల్సింది పేర్కొంటూ సీఐడీ  ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు కసిరెడ్డి సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్టంగా పేర్కొంది.  

కసిరెడ్డి రాజశేఖరరెడ్డి క్వాష్ పిటిషన్ పై శుక్రవారంపిటిషన్‌పై విచారణ చేపటిన హైకోర్టు ధర్మాసనం  సీఐడీ   నోటీసులపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.  తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు పటిషనర్‌కు కొంచం సమయం ఇవ్వాలని సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది.