ఎయిడ్స్ నియంత్రణలో ఎపి మెరుగు 

ఎయిడ్స్ నియంత్రణలో గతేడాది 17 వ స్థానంలో ఉన్న ఎపి ఈ యేడు ఏడో స్థానానికి ఎగబాకింది.  జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ( న్యాకో)  వివిధ రాష్ట్రాల సూచిక విడుదల చేసింది. ఎయిడ్స్ నియంత్రణలో ఎపి కనబరిచిన కృషిని న్యాకో కొనియాడింది. 2004 నుంచి ఎపిలో 2,25,000 మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నట్టు న్యాకో గుర్తించింది. ఈ వ్యాధి నిర్మూలనకు రూ 127 కోట్లు ఖర్చు చేసింది. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందడానికి గల కారణాలను ప్రచారం చేయడంలో ఎపి మెరుగైన కృషి చేసింది.  సెక్స్ వర్కర్లను గుర్తించడంతో బాటు వారికి అవగాహన కల్పించడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందలేదు. 100 హైరిస్క్ గ్రామాలను గుర్తించి  96 శాతం మందికి స్క్రీనింగ్ చేసి చికిత్స చేపట్టినట్టు న్యాకో పేర్కొంది. అధికారులు చేసిన కృషికి వైద్య ఆరోగ్యమంత్రి సత్యకుమార్ అభినందించారు.