తెలంగాణ బిజెపిలో అంతర్యుద్దం... కిషన్ రెడ్డి పై రాజాసింగ్ ఫైర్
posted on Apr 4, 2025 3:11PM
తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు పోటీగా బిజెపికి చెందిన గౌతంరావు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధిష్టానంపై విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ కు గురయ్యారు. గౌతంరావుకు స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధిష్టానంపై ఎక్కుపెట్టారు. మేకప్ మెన్ లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నట్లు ఆరోపించారు. గత పార్ల మెంటు ఎన్నికల్లో హైద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవిలత ప్రకటించగానే రాజాసింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి మగాళ్లే దొరకలేదా అని కామెంట్ చేశారు.
తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల బిజెపి అభ్యర్థిగా గౌతంరావు పేరు ప్రకటించారు. అంబర్ పేట నియోజకవర్గంలో గౌతంరావు, కిషన్ రెడ్డి ప్లెక్సీలు ఉండటంతో రాజాసింగ్ కు మింగుడు పడలేదు. శ్రీరామనవమి శోభాయాత్రకు పోటీగా గౌతంరావు మరో శోభాయాత్ర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. నేను నిర్వహిస్తున్న శోభాయాత్రను అడ్డుకోవడం మీ అయ్యతరం కూడా కాదని వ్యాఖ్యానించారు.