బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ తో ప్రధాని మోడీ భేటీ

 బంగ్లాదేశ్ చైనా, పాక్ లకు మద్దత్తు నిస్తున్న నేపథ్యంలో  భారత ప్రధాని మోడీ   బ్యాంకాక్ లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన  ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.  బ్యాంకాక్ లో బిమ్ స్టెక్ సుమ్మిట్ సందర్బంగా మోదీకి ఆహ్వానం అందింది. ఇదే సుమ్మిట్ కు బంగ్లా ప్రధాని యూనస్ హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్ లకు అనుకూలంగా యూనస్ వ్యాఖ్యానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రతీర ప్రాంతం లేదని, తమ దేశంలో బంగాళాఖాతం తీర ప్రాంతం ఉండటంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకోవచ్చని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గ్యాప్ ఏర్పడింది. యూనస్ ప్రకటనపై అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలు చికెన్ నెక్ కారిడార్ ద్వారా కనెక్ట్ అయ్యాయన్నారు. యూనస్ ప్రకటనను అంత తేలికగా తీసుకోకూడదన్నారు.