LATEST NEWS
హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్  రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ   షోకాజ్ నోటీసు జారీ చేసింది.   పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని  పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.   ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.   పార్టీ ప్రధాన కార్యదర్శి  సోమ భరత్ కుమార్ సంతకంతో.... బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన  ఈ నోటీసులో వారం రోజులలో పైలట్ రోహిత్ రెడ్డి తనపై  వచ్చిన డ్రగ్స్ ఆరోపణ లపై పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.  అలాగే, ఈ విషయంలో పార్టీ  తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు,  అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు.  బీఆర్ఎస్ బాధ్యతా యుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు,  నైతిక విలువలను  పాటిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం వంటి అక్రమ కార్యకలాపా లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ షోకాజ్ నోటీసు పేర్కొంది.   పైలట్ రోహిత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా భావించి కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, నోటీసులో పేర్కొన్న గడువులోపు సంతృప్తికర మైన వివరణ ఇవ్వకపోతే..  ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుం టామని కూడా పైలట్ రోహిత్ రెడ్డిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి తనకు అందిన షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ, ఆ పై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన   పిటిషన్ దాఖలు చేశారు.  ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద  విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.   ఇంతకు ముందే  కేజ్రీవాల్ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను విచారణను వేరే బెంచ్ కు మార్చాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వినతిని తోసిపుచ్చారు. రోస్టర్ నిబంధనల ప్రకారం కేసు కేటాయింపు జరిగిందనీ, విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది   న్యాయమూర్తి విచక్షణకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే తిరస్కరణను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ జరపాలంటూ గతంలో ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని కూడా కేజ్రీవాల్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.   
తెలంగాణ అసెంబ్లీ వేదికగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది.  . బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు..  బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది.  తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజు  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలందరూ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారు.  ఆసమయంలో సమయంలో   రాజాసింగ్,  కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.  కొద్ది సేపు ఇరువురూ నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఫొటోలు తీస్తుంటే.. కేటీఆర్ రాజాసాంగ్ ను ఆటపట్టిస్తూ మనం ముచ్చటించుకుంటుంటే చూసే వారు ఇంకేదో అనుకునే చాన్స్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు.  రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, బడ్జెట్ కేటాయింపులపై పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేటీఆర్, రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ వాతావరణాన్ని తేలిక చేసిందని చెప్పవచ్చు.   అయితే  ఇదొక రాజకీయ వ్యూహంగా కొందరు పేర్కొంటున్నారు. రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు.  ఈ సరదా సంభాషణ ద్వారా కేటీఆర్.. బీజేపీకి స్నేహహస్తం సాచారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సన్నిహితంగా మెలుగుతోందనీ, ఒక దశలో పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న చర్చ కూడా జరిగిందనీ ఇటీవలి కాలంలో కవిత చేసిన విమర్శలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
- వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్..  - టీజర్ అదిరిపోయిందిగా! - మమితా బైజు క్యూట్‌నెస్‌, సూర్య మెచ్యూర్డ్ లుక్  - ఆకట్టుకుంటున్న ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ టీజర్ - జూలైలో థియేట‌ర్ల‌కి.. టీజ‌ర్‌తో పెరిగిన అంచనాలు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విభిన్నమైన కథాంశంతో, ఎమోషనల్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ కలబోసి రూపొందించిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్‌లో సూర్య 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ 'సంజయ్ విశ్వనాథ్' పాత్రలో కనిపిస్తున్నారు. ఎన్నో మెడల్స్ సాధించినా, తనకంటూ కొన్ని లక్ష్యాలతో సాగే మధ్య వయస్కుడిగా సూర్య లుక్ చాలా కొత్తగా ఉంది. ఇక 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ఈ చిత్రంలో 20 ఏళ్ల అమ్మాయిగా, సూర్యను గాఢంగా ప్రేమించే పాత్రలో మెరిసింది. 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే ఈ ఆసక్తికర ప్రేమాయణమే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా సూర్య, మమితల మధ్య సాగే సంభాషణలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. "నువ్వు చిటికేస్తే చాలామంది అబ్బాయిలు పడతారు" అని సూర్య అంటే, "కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా.. నువ్వు పడు చాలు" అని మమితా ఇచ్చే రిప్లై టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. వయసు వ్యత్యాసం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య లవ్ స్టోరీని వెంకీ అట్లూరి తనదైన శైలిలో చాలా హుందాగా, ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి గతంలో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి సూర్య లాంటి వెర్సటైల్ నటుడితో కలిసి పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సూర్య తల్లిగా నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిమిష్ రవి విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మమితా బైజు తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. సూర్య కెరీర్‌లో ఇది మరో విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రాన్ని జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
-రేపు థియేటర్స్ లోకి ఉస్తాద్  -బెనిఫిట్ షో లేదని ఫ్యాన్స్ దిగులు  -కథ ఏంటి! -ఫ్యాన్స్ కి పవన్ మంచి చేశాడా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)గా సెల్యులాయిడ్ పై ల్యాండ్  అయ్యే ముహూర్త వేళా విశేషమో ఏమో గాని అభిమానులకి, మూవీ లవర్స్ కి పవన్ ఒక మంచి పని చేసి పెట్టాడు. ఎక్కడ అండి, ఈ నైట్ బెనిఫిట్ షో లేదంట రేపు ఉదయం నుంచే షో అంట. మంచి అంటారేంటని పూర్తి న్యూస్ చదవకుండానే వాళ్లంతా అలకని అణిచివేసుకుంటు అనుకోవచ్చు. పవన్ మానియా కాబట్టి ఆ మాత్రం అలక ఉండాలనుకోండి.  రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొడుతుండటమే కాదు ఎన్నో ప్రశ్నలని కూడా లేవనెత్తుతుంది. సదరు న్యూస్ ఏంటో చూసేద్దాం. ఉస్తాద్ కథ యొక్క మెయిన్ పాయింట్ ఒక సున్నితమైన అంశం చుట్టూ ట్రావెల్ కాబోతుందనే వార్తలు ఫ్రెష్ నెస్ హోదాలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఈ విషయంపై దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar)మాట్లాడుతు 'మీరు అనుకున్నట్టే సున్నితమైన పాయింట్ నే. కానీ చెప్పాల్సిన రీతిలోనే చెప్పాము. కానీ ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా సదరు పాయింట్ పై  మరి లోతుల్లోకి వెళ్ళలేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలవడంతో  అభిమానులు, మూవీ లవర్స్ ట్రైలర్ ని అదే పనిగా చూస్తు కథని అంచనా వేసే సినీ శాస్తవేతలుగా మారిపోయారు.     Also read: Nayanthara: నయనతారపై ప్రముఖ ఎంపి కీలక వ్యాఖ్యలు.. కలవాలని ఉంటే కోరిక నెరవేరుస్తారా!  ఇంతకీ అభిమానులు, మూవీ లవర్స్ కి  పవన్ చేసిన మంచి ఏంటంటే మిడ్ నైట్ షోస్ వలన వాళ్లంతా ఈ మధ్యాహ్నం నుంచే తమ వర్క్ ప్లేస్ ల్లో పర్మిషన్ అడగటానికి అనవసరమైన యాక్టింగ్ చేసే అవకాశం లేదు. పైగా మిడ్ నైట్ షోస్ చూసి రేపు వర్క్ ప్లేసుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే  లేదు. హ్యాపీగా రేపు శుభోదయనా సూర్యుడు కి గుడ్ మార్నింగ్ చెప్పి ఉస్తాద్ ని వీక్షించవచ్చు. ఉద్వేగంతో కూడిన ఆనందంతో ఎదురుచూస్తూ తమ అభిమాన హీరో సినిమా చూస్తే బాడీలో కలిగే పాజిటివ్ ఎనర్జీకి సర్వ రోగాలు కూడా మాయం.    
- థ్రిల్లర్ లవర్స్ అలర్ట్..  - నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్ క్రైమ్ డ్రామాలు ఇవే! - మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మెప్పించే బెస్ట్ ఓటీటీ సినిమాలు - రాత్రి నిద్రపోనివ్వని రేంజ్ థ్రిల్లింగ్.. ఈ సినిమాలను చూశారా? వారాంతం వచ్చిందంటే చాలు సినీ ప్రియులు ఏదైనా కొత్త సినిమా చూడాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఇంటి వద్దే ఉండి ఓటీటీలో వైవిధ్యమైన కథలను ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరి ఈ వీకెండ్‌లో మీ మెదడుకు మేత వేసేలా, ఒళ్లు గగుర్పొడిచే సస్పెన్స్ థ్రిల్లర్లను చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఎమ్‌డీబీలో కూడా మంచి రేటింగ్ సాధించిన ఈ కళ్లు చెదిరే సినిమాలపై ఓ లుక్కేయండి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 'సెక్టార్ 36' (Sector 36) అనే చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2006లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక విచక్షణారహితమైన సీరియల్ కిల్లర్, అతడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. ప్రతి హత్యకు ఒక లింక్ వెతకడం, దాని వెనుక ఉన్న భయానక వాస్తవాలను బయటపెట్టడం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. అదేవిధంగా కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'జానే జాన్' (Jaane Jaan) మరో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్. తన కుమార్తె కోసం ఒక తల్లి చేసిన పోరాటం, అందులో అనుకోకుండా జరిగిన ఒక మరణం చుట్టూ మిస్టరీ నడుస్తుంది. ఇది కేవలం క్రైమ్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఉండే ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. సుజోయ్ ఘోష్ దర్శకత్వ ప్రతిభకు ఈ చిత్రం ఒక నిదర్శనంగా నిలిచింది. ఇక విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కాంబినేషన్‌లో వచ్చిన 'మెర్రీ క్రిస్మస్' (Merry Christmas) సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ రోజున పరిచయమైన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వింతైన సంఘటనలు, ఆ తర్వాత చోటుచేసుకునే నాటకీయ పరిణామాలు సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచాయి. స్లో పేస్డ్‌గా సాగినా, ముగింపులో ఇచ్చే షాక్ మాత్రం అద్భుతం. ఈ చిత్రాల్లో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా విక్రాంత్ మాస్సే, విజయ్ సేతుపతి తమ నటనతో సినిమా స్థాయిని పెంచేశారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సోషల్ మీడియా నెటిజన్లు కూడా ఈ సినిమాలపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. "వీటిని చూస్తున్నప్పుడు కళ్లు ఆర్పడం కూడా మర్చిపోయాము" అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీరు గనుక ఒకే తరహా రొటీన్ సినిమాలతో బోర్ ఫీలవుతుంటే, ఈ వీకెండ్ ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్లతో మీ సమయాన్ని గడిపేయండి. మున్ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు. ఉగాది కానుకగా రేపు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల(Sreeleela) స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కల నెరవేరిన వేళ ప్రతి హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలనే కోరిక ఉంటుంది. శ్రీలీల విషయంలో కూడా అదే జరిగింది. తన తల్లికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, ఈ అవకాశం రాగానే తన తల్లి ఎంతగానో సంతోషించిందని శ్రీలీల తెలిపింది. షూటింగ్ మొదటి రోజున జరిగిన ఒక అనుభవం గురించి చెబుతూ, తను ఎంత నర్వస్‌గా ఫీల్ అయిందో వివరించింది. ముఖ్యంగా పింక్ శారీ కట్టుకుని బారికేడ్ దాటుకుని వచ్చే సీన్ తనకి పవన్ కళ్యాణ్ తో మొదటి షాట్ అని, అప్పుడు ఆయన కళ్ళలోకి చూడగానే ఒక తెలియని భయం, గౌరవం కలిగాయని ఆమె తెలిపింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా కైండ్‌గా ఉంటూ తనను కంఫర్టబుల్‌గా మార్చేశారని పేర్కొంది. హరీష్ శంకర్ 'ఊర మాస్' స్కూలింగ్ దర్శకుడు హరీష్ శంకర్ గురించి చెబుతూ, ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసని, ఆయన ఒక అభిమానిలా ఆలోచించి సినిమా తీస్తారని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని, ఒక్కోసారి రోజుకు 3-4 సీన్లు కూడా కంప్లీట్ చేసేవాళ్లమని తెలిపింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హరీష్ ఆమెకు ముందుగా స్క్రిప్ట్ పేపర్లు ఇచ్చేవారు కాదట. ఆన్ ది స్పాట్ డైలాగులు ఇచ్చి పటపట చెప్పేయమని అడిగేవారట. అది తనకు ఒక సవాలుగా ఉన్నా, తన తెలుగు భాషా పరిజ్ఞానం వల్ల సులభంగానే చేయగలిగానని ఆమె వివరించింది. పవర్ స్టార్ స్వాగ్, శ్రీలీల ఇమిటేషన్ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ చూసి శ్రీలీల ఫిదా అయింది. ఆయన కిందకు చూసి నవ్వే స్టైల్‌ను ఆమె సరదాగా ఇమిటేట్ చేస్తూ అభిమానులను అలరించింది. పవన్ కళ్యాణ్ చాలా మొహమాటస్తులని, కొన్ని సీన్స్ చేయడానికి ఇబ్బందిపడేవారని.. కానీ హరీష్ శంకర్ 'సార్, ఇది మీ ఫ్యాన్స్ కోసం' అని చెప్పగానే ఆయన ఎంతో కంఫర్టబుల్‌గా ఆ సీన్లు చేసేవారని శ్రీలీల చెప్పుకొచ్చింది. డాక్టర్ శ్రీలీల: షూటింగ్ & స్టడీస్ శ్రీలీల కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ కూడా. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమె తన MBBS పూర్తి చేయడం విశేషం. ఒక పక్క షూటింగ్ హడావిడి, మరోపక్క రికార్డులు రాయడం, పరీక్షలకు హాజరుకావడం వంటివి చాలా హెక్టిక్‌గా అనిపించినా, తన తాతగారికి ఇచ్చిన మాట కోసం కష్టపడి స్టడీ పూర్తి చేశానని చెప్పింది. ఉగాదికి 'ఫుల్ మీల్స్' మార్చి 19న ఉగాది పండుగ కానుకగా 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల కాబోతోంది. ఈ సినిమా ఒక 'సినిమాటిక్ ట్రీట్' అని, అభిమానులకు కావాల్సిన అన్ని ఎమోషన్లు, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లు ఇందులో ఉంటాయని శ్రీలీల తెలిపింది. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఎంతో అందంగా ఉన్నారని, ఆయన డ్యాన్స్ ఫ్యాన్స్‌కి కనువిందుగా ఉంటుందని శ్రీలీల పేర్కొంది. శ్రీలీల పూర్తి ఇంటర్వ్యూ కోసం మరియు మరిన్ని ఆసక్తికర సినిమా విశేషాల కోసం మా 'తెలుగువన్ సినిమా'(TeluguOne Cinema) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. Also Read: విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ రివ్యూ
- వివాదంలో 'కేడీ: ది డెవిల్' మూవీ సాంగ్ - నో రా ఫతేహి స్టెప్పులపై అభ్యంతరాలు! - సెన్సార్ బోర్డుకు కేంద్రం కీలక ఆదేశాలు..  - ఆ అసభ్యకర పాటను వెంటనే డిలీట్ చేయండి! - ధ్రువ సర్జా సినిమాకు షాక్..  కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కేడీ: ది డెవిల్'. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది. చిత్ర ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఒక స్పెషల్ సాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఆడిపాడిన 'సర్కే చునార్ తేరీ సర్కే' అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం ఇటీవలే సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే, ఈ పాటలోని సాహిత్యం మరియు నోరా వేసిన స్టెప్పులు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ పాట భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ వివాదంపై స్పందించిన 'ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్', కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. సదరు పాటను యూట్యూబ్ సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుండి తక్షణమే తొలగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అసభ్యకర కంటెంట్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ 'కేడీ: ది డెవిల్' మూవీలో సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1970వ దశకంలోని బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇంతకుముందు విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. కానీ, ఇప్పుడు ఈ పాట వివాదం సినిమా టీమ్‌కు కొంత ఇబ్బందికరంగా మారింది. సెన్సార్ నిబంధనలు పాటించకుండా ఇటువంటి కంటెంట్‌ను ప్రమోట్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మొత్తానికి, 'సర్కే చునార్' సాంగ్‌ను అన్ని చోట్లా డిలీట్ చేయాలని కేంద్రం ఆదేశించడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు ఆ పాటను ఎడిట్ చేస్తుందా లేదా పూర్తిగా తొలగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదం సినిమా బాక్సాఫీస్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు.  గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాత్రల సెలక్షన్..  ఉపయోగించే వంట పాత్రల రకం కూడా  గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ  అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి.  ఈ  పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా  ఉంటే, వేడి వ్యాపిస్తుంద,  వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీడియం ప్లేమ్.. అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని,  గ్యాస్ వినియోగం తగ్గుతుందని  అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది,  ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు,  బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా,  సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్.. వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మూత పెట్టి వండటం.. వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి  ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. బర్నర్.. బర్నర్ శుభ్రతపై  శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది  మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.                                                   *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్  రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ   షోకాజ్ నోటీసు జారీ చేసింది.   పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని  పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.   ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.   పార్టీ ప్రధాన కార్యదర్శి  సోమ భరత్ కుమార్ సంతకంతో.... బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన  ఈ నోటీసులో వారం రోజులలో పైలట్ రోహిత్ రెడ్డి తనపై  వచ్చిన డ్రగ్స్ ఆరోపణ లపై పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.  అలాగే, ఈ విషయంలో పార్టీ  తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు,  అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు.  బీఆర్ఎస్ బాధ్యతా యుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు,  నైతిక విలువలను  పాటిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం వంటి అక్రమ కార్యకలాపా లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ షోకాజ్ నోటీసు పేర్కొంది.   పైలట్ రోహిత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా భావించి కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, నోటీసులో పేర్కొన్న గడువులోపు సంతృప్తికర మైన వివరణ ఇవ్వకపోతే..  ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుం టామని కూడా పైలట్ రోహిత్ రెడ్డిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి తనకు అందిన షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ, ఆ పై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన   పిటిషన్ దాఖలు చేశారు.  ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద  విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.   ఇంతకు ముందే  కేజ్రీవాల్ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను విచారణను వేరే బెంచ్ కు మార్చాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వినతిని తోసిపుచ్చారు. రోస్టర్ నిబంధనల ప్రకారం కేసు కేటాయింపు జరిగిందనీ, విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది   న్యాయమూర్తి విచక్షణకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే తిరస్కరణను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ జరపాలంటూ గతంలో ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని కూడా కేజ్రీవాల్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.   
తెలంగాణ అసెంబ్లీ వేదికగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది.  . బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు..  బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది.  తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజు  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలందరూ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారు.  ఆసమయంలో సమయంలో   రాజాసింగ్,  కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.  కొద్ది సేపు ఇరువురూ నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఫొటోలు తీస్తుంటే.. కేటీఆర్ రాజాసాంగ్ ను ఆటపట్టిస్తూ మనం ముచ్చటించుకుంటుంటే చూసే వారు ఇంకేదో అనుకునే చాన్స్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు.  రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, బడ్జెట్ కేటాయింపులపై పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేటీఆర్, రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ వాతావరణాన్ని తేలిక చేసిందని చెప్పవచ్చు.   అయితే  ఇదొక రాజకీయ వ్యూహంగా కొందరు పేర్కొంటున్నారు. రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు.  ఈ సరదా సంభాషణ ద్వారా కేటీఆర్.. బీజేపీకి స్నేహహస్తం సాచారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సన్నిహితంగా మెలుగుతోందనీ, ఒక దశలో పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న చర్చ కూడా జరిగిందనీ ఇటీవలి కాలంలో కవిత చేసిన విమర్శలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.