14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతాపార్టీ భారీ నిరసన!

posted on: Jun 12, 2026 9:47AM

భారతదేశ వ్యాప్తంగా  పెను సంచలనం సృష్టిస్తున్న  కాక్రోచ్ జంతా పార్టీ  ఇప్పుడు హైదరాబాద్ లో భారీ నిరసన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.  సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తున్న ఈ వినూత్న ఉద్యమం   తెలంగాణ గడ్డపై కాలూనుతోంది. ఈ నెల  14న  హైదరాబాద్  వేదికగా ఒక భారీ  నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ  ప్రకటించింది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిరసన సాగనుంది.  ఈ ఆందోళన  చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో,  ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ  ఉద్యమం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఈ ఇండియన్  కాక్రోచ్ జనతాపార్టీ దేశ సరిహద్దులను దాటి విస్తరించింది.  మీడియాలో పుట్టిన ఈ  కాక్రోచ్ ట్రెండ్ ఇప్పుడు   పాకిస్థాన్ లోకి కూడా చొచ్చుకెళ్లింది. అక్కడ కూడా స్థానిక యువత ఈ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై  కాక్రోచ్ అవామీ పార్టీ,  కాక్రోచ్ అవామీ లీగ్ వంటి సరికొత్త గ్రూపులను సోషల్ మీడియాలో ప్రారంభించారు.  భాగ్యనగర వీధుల్లో యువత శాంతియుతంగా వినిపించబోయే ఈ గళం, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...