LATEST NEWS
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల  వ్యవహారంలో   వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   తన పరిపాలనా దక్షతతో, సత్వర నిర్ణయాలతో చెక్ పెట్టారు.  విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.  2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.   ఈ సున్నితమైన ఉదంతంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా  బాధితుడి నివాసానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిబిఐకు  డిమాండ్ చేశారు. అంతేకాకుండా..  ఈ వివాదానికి కుల రంగు అద్దే ప్రయత్నం చేస్తూ సామాజిక వర్గాల నేతలను కూడా రంగంలోకి దించారు. సాధారణంగా ఇలాంటి విషాద సమయాల్లో బాధితులకు మానవత్వంతో అండగా నిలవాలి. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా,   రాజకీయ మైలేజీ కోసం కులం కార్డును తెరపైకి తీసుకువచ్చింది. అంబటిరాంబాబు, తోట త్రిమూర్తులు, కొరసాల కన్నబాబు వంటి వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలను  సాయికృష్ణ విషయానికి కులం రంగు అద్ధి విమర్శలు గుప్పించారు.   ఈ మొత్తం పరిణామాలు చోటుచేసుకునే సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌లో ఉన్నారు. అయినప్పటికీ..  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ, . ప్రతిపక్షాలు ఈ కేసును సాకుగా చూపి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించారు. వెంటనే.. ఎక్కడా రాజకీయ   లేదా విమర్శలకు పోకుండా..  కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం ద్వారా ఈ సమస్యకు  పరిష్కారం చూపారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పరస్పరం సంప్రదించుకుని బాధిత కుటుంబంలో నమ్మకాన్ని నింపేలా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా ముందుగా స్థానిక కూటమి శాసనసభ్యుడిని  సాయికృష్ణ ఇంటికి పంపారు.  ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన  తక్షణ స్పందన బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది.  కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు.  సాయికృష్ణ వ్యవహారంలో  ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక  సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ఆయనపై  హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి..  దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. జగన్ పరామర్శ ముగించుకుని వెళ్లిన మరుసటి రోజే  అంటే శుక్రవారం (జూన్ 19) దర్యాప్తు అధికారి దైవప్రసాద్ స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి  వివరాలను సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర  చర్యల పట్ల సాయికృష్ణ కుటుంబ సభ్యులు పూర్తి సంతృప్తివ్యక్తం చేశారు.  తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని   పేర్కొన్నారు. దీంతో సాయికృష్ణ వ్యవహారంలో పొలిటికల్ మైలేజీ పొందాలన్న వైసీపీ ఆశలు ఆవిరయ్యాయి.   ఈ వివాదాన్ని చక్కదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి శాంతిభద్రతల విభాగంపై, ముఖ్యంగా పోలీస్ డైరెక్టర్ జనరల్  పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, బాధితులకు తక్షణ న్యాయం అందాలన్న స్పష్టమైన సంకేతాలను  పంపారు.  
  తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది. స్థానికంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ శ్రేణుల దూకుడుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అత్యంత ఘాటుగా స్పందించారు. శుక్రవారం మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రౌడీయిజానికి, గూండాయిజానికి పాల్పడుతున్న నాయకులకు ఆయన ముక్కుతాడు వేసేలా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  మల్కాజ్‌గిరిలో కొందరు నాయకులు తామేదో పెద్ద గూండాలమని, రౌడీలమని విర్రవీగుతున్నారని, అలాంటి వారి ఆటలు సాగనివ్వబోమని కేటీఆర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గులాబీ సైనికులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత భావోద్వేగంగా భరోసా ఇచ్చారు.  మల్కాజ్‌గిరి గడ్డపై రౌడీయిజం ప్రదర్శిస్తున్న నాయకుడికి గట్టి కౌంటర్ ఇస్తూ, నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా వందల సంఖ్యలో ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానికంగా ఏ రౌడీ వచ్చినా కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తానే స్వయంగా మల్కాజ్‌గిరికి వస్తానని హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఏ చిన్న అక్రమ కేసు పెట్టినా, తానే స్వయంగా ముందుండి వారిని విడిపించుకుంటానని క్యాడర్‌లో కొత్త జోష్ నింపారు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అధికార బలంతో వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. ఈ పోరాటంలో పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క కార్యకర్తకు కొండంత అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇదే వేదికపై నుంచి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల జడివాన కురిపించారు. అడ్డగోలు మాటలు చెప్పి, నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కేవలం 100 రోజుల్లోనే ప్రతిష్టాత్మకమైన 420 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠం దక్కించుకుని నేటికి ఏకంగా 900 రోజులు దాటిపోయిందని కీలక గణాంకాలను బయటపెట్టారు.  100 రోజుల గడువు కాస్తా 900 రోజులు దాటినా, ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలు ఊసే లేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 420 గ్యారంటీల అమలు ఇంకెప్పుడు చేస్తారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రులను కేటీఆర్ నిలదీశారు.  ఈ అన్యాయమైన పాలనపై కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. 
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తున్నది.  గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై  చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం కూటమి సిద్ధమైందని అంటున్నారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై  పూర్తిస్థాయిలో ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంతో గుడివాడ రాజకీయాలతో పాటు ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ హీట్  పెరిగింది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత  వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో  ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.  నిజానికి కొడాలి నానిపై కేవలం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసు మాత్రమే కాదు..  ఆర్థిక, శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి.  గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గుడివాడ పరిధిలోనే సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తరలించారని, జగనన్న కాలనీల భూములను లెవెల్  చేసే ప్రక్రియలో కొందరు స్థానిక యువకుల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను వాడుకుని భారీగా నిధుల బదిలీ  జరిగిందని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.   మట్టి కుంభకోణంలోనూ, అలాగే..  గతంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై జరిగిన   దాడుల కేసుల్లోనూ కొడాలి నానికి నేరుగా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆయా కేసుల్లో కొందరిని అరెస్టు కూడా అయ్యారు. కాగా..  అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. దీనితో పాటు మట్టి తవ్వకాలు, గుడివాడ తెలుగుదేశం కార్యాలయం దగ్ధం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై దాడి కేసులలో కూడా నానిని విచారించి.. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రాసిక్యూషన్ ప్రక్రియ ద్వారా ఆయనపై నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
One of the most anticipated and exciting combinations today, Vishwanath And Sons starring Suriya and directed by Venky Atluri has officially locked August 14, 2026 for its grand worldwide theatrical release. The makers recently unveiled the film's first single Neno Butterfly and the response has been overwhelmingly positive. From the very first listen, the song strikes a chord with its infectious melody and refreshing vibe making it one of the most promising musical releases of the season. Going by the early response, the song is expected to create a strong impact and grow into a major favorite among music lovers in the coming days. When it comes to melodies, GV Prakash Kumar never misses the mark and once again he has delivered a magical composition. His successful collaboration with director Venky Atluri continues to impress audiences further raising expectations for the film's musical album. Sung by Subhalashini whose impressive run with recent blockbuster tracks has made her one of the most sought after voices today. Adding further depth to the composition are the lyrics penned by Saraswatiputra Ramajogayya Sastry perfectly capturing the innocence, excitement and emotions of love. Ever since its announcement, Vishwanath And Sons has generated tremendous positivity and excitement across audiences and trade circles alike. Every promotional asset released so far has managed to create a strong impact emerging as a talking point among movie lovers. The anticipation surrounding the film continues to grow as audiences eagerly await what promises to be a wholesome, emotional and heartwarming experience mounted on a grand scale. The film is produced by Suryadevara Naga Vamsi along with Sai Soujanya under the banners of Sithara Entertainments in association with Fortune Four Cinemas and Presented Srikara Studios. Naga Vamsi who has earned widespread acclaim for backing successful films such as Vaathi and Lucky Baskhar once again brings together a powerful combination with all the ingredients of a grand theatrical celebration. Vishwanath And Sons is shaping up to be one of the biggest and most celebrated family entertainers to watch out for in 2026. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Cast: Vadde Naveen, Raashi Singh, Devi Prasad, Shilpa Tulaskar, Baba Baskar, Raghu Babu Crew:  Written by Kamal Teja Narla, Naveen Vadde Cinematography by Karthik Sai Kumar Music by Kalyan Nayak Editing by Vijay Mukthavarapu Directed by Kamal Teja Narla Produced by Naveen Vadde Naveen Vadde made a great impression on audiences in late 1990's and early 2000's. But he lost his market due to continuous flops and slowly stopped working. He made a comeback to big screens with Transfer Trimurthulu in the direction of Kamal Teja Narla. The movie stars Raashi Singh as leading lady and it released, Today. Let's discuss about the film in detail.  Plot:  Police Constable Trimurthulu (Vadde Naveen) gets transferred 56 times in 7 years of his service. His sincerity and honesty force him to face wrath of his senior officials. His wife Lakshmi (Raashi Singh) and kid are accustomed to these transfers. At one meeting, he spoils Chief Minister (Shilpa Tulaskar)'s plans to launch her son as a future leader by staging a Draupadi Vastrapaharanam style disrespect towards her that would enhance their political chances. Hence, he gets transferred to an old police station that had his father Srinivasulu (Devi Prasad) as a constable. He finds one 20-year case that his father could not solve and what happens next is the story.  Analysis:  Vadde Naveen had a strong screen presence in his early career films but at this age, he seems to have lost it. While he did put in a lot of efforts to dance, fight and in his performance, the script doesn't suit him. There is no organic flow of emotions and the film drags any chance at real emotional gravitas. The script has dated feel and the emotions feel fabricated.  A story that feels like a cross between Kavaludaari and Jolly LLB seems completely lost in script. As a screenplay, it feels jaded, lazy and too repetitive. None of the scenes have the desired effect as the makers wanted. Most of the scenes fail to register any sort of weight and falls into the category of trying to ape something that worked.  Music by Kalyan Nayak is too laborious and none of the departments really deliver. The drag in the second hour just frustrates audiences while techncially it could have been better. The film tries to re-establish Naveen Vadde's comeback but ends up being just another attempt with once popular star in action genre.  Positives:  Vadde Naveen efforts Raashi Singh looks Basic idea  Negatives: Dated Narrative Jaded Style Story Outdated Screenplay Music Bottomline: Very Disappointing affair  Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  సంగీత ప్రియుల హృదయాల్లో థమన్(Thaman)కి ఉన్న స్థానం తెలిసిందే. సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా . ఎంత బిజీగా ఉన్నాకూడా గతంలో మహేష్ బాబు అభిమాని కుటుంబానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని అందరి హృదయాలని గెలుచుకున్నాడు. హైదరాబాద్ కి చెందిన మహేష్ బాబు వీరాభిమాని గత ఏడాది మరణించాడు.ఆ సమయంలో అతని పిల్లల పూర్తి చదువు బాధ్యతలని తాను తీసుకుంటానని చెప్పాడు. అన్నట్టుగానే థమన్ పిల్లల స్కూల్ ఫీజ్ కట్టి సదరు రసీదులని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు. సోదరా వాళ్ళ ఫీజులు కట్టేసాను. ఈ విషయం వాళ్ళ మదర్ కి చెప్పండి.  వారి చదువులు పూర్తి అయిన దాకా నాదే బాధ్యత.. ఆ చిన్నారులు భవిషత్తులో గొప్పగా రాణించేలా చేద్దామనే వ్యాఖ్యలు కూడా చేసాడు. Also read: Naga Durga: ఫోక్ సింగర్ నాగదుర్గకి లక్కీ ఛాన్స్..ఆ అగ్ర నిర్మాతల నుంచి పిలుపు!   
హిట్టు,ప్లాపుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రియదర్శి. కామెడీ రోల్స్ నుండి సీరియస్ క్యారెక్టర్స్ వరకు ప్రతి క్యారక్టర్ లోను మెప్పించే ప్రియదర్శి త్వరలోనే ఒక సరికొత్త క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నాడు . టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సుకుమార్ రైటింగ్స్' 'బన్నీ వాస్ ప్రొడక్షన్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.  ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రముఖ యూట్యూబ్ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ. 'కాపోళ్ల ఇంటికాడా', 'పేరుగల్ల పెద్దిరెడ్డి', అలాగే 'దారి పొంటొతుండు' వంటి విలక్షణమైన తెలంగాణ జానపద గీతాలతో సోషల్ మీడియాని ఊపేసిన నాగదుర్గకి ఇది కెరీర్ లోనే అతిపెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పాలి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ, తన అద్భుతమైన నృత్యంతోనూ, గొంతుతోనూ లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ పల్లెటూరి పిల్లకు ఈ టాప్ బ్యానర్ల సినిమాలో అవకాశం రావడం విశేషం. ఇప్పటికే 'కలివి వనం' అనే ఒక విలక్షణమైన ప్రయోగాత్మక చిత్రంలో చేసిన నాగదుర్గ, ఆ తర్వాత తమిళంలో కూడా ఒక క్రేజీ ప్రాజెక్టులో భాగమైంది. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మెయిన్ లీడ్ రోల్‌ను సొంతం చేసుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. Also read: Transfer Trimurthulu Movie Review In Telugu: ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ తెలంగాణ నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో సహజంగా తెరకెక్కబోతున్న ఈ సరికొత్త సినిమాతో వంశీ రెడ్డి దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల ఎమోషన్స్, మరియు నాగదుర్గ సహజసిద్ధమైన నటన, హావభావాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయని మేకర్స్ భావిస్తున్నారు. యూట్యూబ్‌లో 100 శాతానికి పైగా గ్రామీణ ప్రేక్షకులను అలరించిన ఒక ఫోక్ స్టార్, ఇప్పుడు వెండితెరపై ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. ఈ సరికొత్త కాంబినేషన్‌కి  సంబంధించిన పూర్తి వివరాలు, టైటిల్ మరియు ఇతర నటీనటుల గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.    
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, గ్లామరస్ నటి రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'మరీచిక'. ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా ఈ సినిమా నేరుగా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. క్రైమ్ మరియు సస్పెన్స్ కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్ లో ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ వీక్షించడానికి అందుబాటులో ఉంది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, సైలెంట్‌గా డిజిటల్ స్క్రీన్‌పైకి రావడంతో ఓటీటీ ప్రియులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక వైవిధ్యమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు లవ్ ట్రయాంగిల్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. కథ విషయానికి వస్తే.. నటీనటుల అసలు గుర్తింపులు, నమ్మకద్రోహాలు మరియు మితిమీరిన ప్రేమ అనే అంశాల చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ డ్రామాగా దీనిని దర్శకుడు సతీష్ కాశెట్టి తెరకెక్కించారు. విరాజ్ అశ్విన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ మైండ్ గేమ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ఇస్తాయి. టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గతేడాది 'టిల్లు స్క్వేర్' తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యూత్‌ను ఆకట్టుకున్న ఈ భామ, 'మరీచిక' లో మాత్రం డీగ్లామరైజ్డ్, పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించి మెప్పించింది. మరోవైపు రెజీనా కాసాండ్రా సైతం తన నటనతో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై నెటిజన్లు, సినీ ప్రియులు గట్టిగానే చర్చిస్తున్నారు. వీకెండ్ లో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి 'మరీచిక' మంచి ఆప్షన్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ముందస్తు ప్రమోషన్లు లేకపోయినా, లీడ్ యాక్ట్రెస్ల క్రేజ్ కారణంగా ప్రైమ్ వీడియోలో ఈ సినిమాకు మంచి వ్యూయర్ షిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌తో పాటు ఈ వారంలో 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3', రవిబాబు 'రేజర్' లాంటి మరికొన్ని తెలుగు కంటెంట్‌లు కూడా వేర్వేరు ఓటీటీ వేదికల్లో సందడి చేస్తున్నాయి. అనుపమ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆమె మరికొన్ని భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారు ఆలస్యం చేయకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మరీచిక' పై ఒక లుక్కేసేయండి!
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి. కానీ అంతవరకు అలాంటి అప్యాయత ఏమీ లేని భర్త  అకస్మాత్తుగా మితిమీరిన ఆప్యాయతను చూపించడం, అధికంగా  శ్రద్ధ చూపడం లేదా అంతకు ముందు ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉండటం వంటివి జరిగితే దాన్ని చాలా సులువుగా కొట్టి పారేయకూడదని అంటున్నారు రిలేషన్ నిపుణులు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని, ఇలాంటి మార్పు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  విడాకుల ప్రమాదం.. భార్యాభర్తల బంధం  ప్రారంభంలో మితిమీరిన ప్రేమతో ఉండే జంటలకు జీవితంలో తర్వాత విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు 168 జంటలను 13 సంవత్సరాల పాటు అనుసరించి ఈ విషయాన్ని వెలిబుచ్చారు.  సంబంధం ప్రారంభంలో మితిమీరిన శృంగారభరితంగా , చాలా ఆనందంగా ప్రవర్తించే వారికి కాలక్రమేణా విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారట. మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదకరం?  సంబంధంలో నమ్మకం లేదా కమ్యూనికేషన్  లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మితిమీరిన ఆప్యాయత అని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన తీవ్రమైన ఆప్యాయత ఎక్కువకాలం నిలవదని అంటున్నారు. బంధం ప్రారంబైమనప్పుడు అతి చాలా చాలా మితిమీరి ఉంటే.. ఆ తరువాత ఆ బంధం శూన్యంగా మారే అవకాశం ఉంటుదని అంటున్నారు. మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదం? ప్రతి సంబంధంలోనూ ఒక మధురమైన దశ ఉంటుంది, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ  ఒకరితో ఒకరు ఎంతో  సన్నిహితంగా ఉంటారు. కానీ కాలక్రమేణా ఈ అనురాగం తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. భార్యాభర్తల బంధం మొదలైనప్పుడే ఎమోషన్ గా ఒకరిమీద మరొకరు ఆధారపడితే  సమస్య తలెత్తుతుంది. మొదట్లో ఉన్న  ప్రేమ,  సాన్నిహిత్యం క్రమంగా బాధ్యతలు,  ఇంటి విషయాల కారణంగా  తగ్గినప్పుడు వారి బంధంలో ప్రేమ కనుమరుగైపోయిందని భార్యాభర్తలలో ఎవరో ఒకరు తప్పకుండా ఫీలవుతారు.. ఒక బలమైన సంబంధం కేవలం ఆప్యాయతతో మాత్రమే బిల్డ్ కాదు.. బంధంలో నిజాయితీ, నమ్మకం, ఒకరితో మరొకరు మాట్లాడే తీరు,  ఒకరికి ఒకరు  సహకరించే విధానం  అనేవి బంధం ఎక్కువ కాలం పాటు బలంగా ఉండటానికి పునాది అవుతుంది . భార్యాభర్తల బంధంలో  ఆప్యాయతను మితిమీరి ప్రదర్శించడం అనేది, ఆ లోటును భర్తీ చేయడానికి చేసే ప్రయత్నానికి సంకేతం కావచ్చని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. లవ్ బాంబింగ్.. లవ్ బాంబింగ్‌ను ఒక ప్రధాన హెచ్చరిక సంకేతంగా  రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.  ఒక వ్యక్తి త్వరగా భావోద్వేగపరంగా దగ్గరవ్వాలనే ఆశతో, మొదట తమ భాగస్వామిపై మితిమీరిన ప్రేమను, బహుమతులను, పొగడ్తలను కురిపిస్తారు. ఆ తర్వాత, ఈ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. తరచుగా, భాగస్వామి తమను తామే నిందించుకోవడం మొదలుపెట్టి, సంబంధాన్ని తిరిగి బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, దీని అర్థం మితిమీరిన ప్రేమను చూపించే ప్రతి భాగస్వామి తప్పు అని కాదు. కానీ అతిగా ప్రేమ ఉంటే ఆ తర్వాత ప్రేమ లేకపోవడాన్ని భరించలేక గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది. ఇది విడాకుల దాకా కూడా వెళ్లవచ్చు.                                          *రూపశ్రీ.
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల  వ్యవహారంలో   వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   తన పరిపాలనా దక్షతతో, సత్వర నిర్ణయాలతో చెక్ పెట్టారు.  విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.  2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.   ఈ సున్నితమైన ఉదంతంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా  బాధితుడి నివాసానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిబిఐకు  డిమాండ్ చేశారు. అంతేకాకుండా..  ఈ వివాదానికి కుల రంగు అద్దే ప్రయత్నం చేస్తూ సామాజిక వర్గాల నేతలను కూడా రంగంలోకి దించారు. సాధారణంగా ఇలాంటి విషాద సమయాల్లో బాధితులకు మానవత్వంతో అండగా నిలవాలి. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా,   రాజకీయ మైలేజీ కోసం కులం కార్డును తెరపైకి తీసుకువచ్చింది. అంబటిరాంబాబు, తోట త్రిమూర్తులు, కొరసాల కన్నబాబు వంటి వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలను  సాయికృష్ణ విషయానికి కులం రంగు అద్ధి విమర్శలు గుప్పించారు.   ఈ మొత్తం పరిణామాలు చోటుచేసుకునే సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌లో ఉన్నారు. అయినప్పటికీ..  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ, . ప్రతిపక్షాలు ఈ కేసును సాకుగా చూపి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించారు. వెంటనే.. ఎక్కడా రాజకీయ   లేదా విమర్శలకు పోకుండా..  కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం ద్వారా ఈ సమస్యకు  పరిష్కారం చూపారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పరస్పరం సంప్రదించుకుని బాధిత కుటుంబంలో నమ్మకాన్ని నింపేలా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా ముందుగా స్థానిక కూటమి శాసనసభ్యుడిని  సాయికృష్ణ ఇంటికి పంపారు.  ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన  తక్షణ స్పందన బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది.  కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు.  సాయికృష్ణ వ్యవహారంలో  ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక  సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ఆయనపై  హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి..  దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. జగన్ పరామర్శ ముగించుకుని వెళ్లిన మరుసటి రోజే  అంటే శుక్రవారం (జూన్ 19) దర్యాప్తు అధికారి దైవప్రసాద్ స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి  వివరాలను సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర  చర్యల పట్ల సాయికృష్ణ కుటుంబ సభ్యులు పూర్తి సంతృప్తివ్యక్తం చేశారు.  తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని   పేర్కొన్నారు. దీంతో సాయికృష్ణ వ్యవహారంలో పొలిటికల్ మైలేజీ పొందాలన్న వైసీపీ ఆశలు ఆవిరయ్యాయి.   ఈ వివాదాన్ని చక్కదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి శాంతిభద్రతల విభాగంపై, ముఖ్యంగా పోలీస్ డైరెక్టర్ జనరల్  పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, బాధితులకు తక్షణ న్యాయం అందాలన్న స్పష్టమైన సంకేతాలను  పంపారు.  
  తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది. స్థానికంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ శ్రేణుల దూకుడుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అత్యంత ఘాటుగా స్పందించారు. శుక్రవారం మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రౌడీయిజానికి, గూండాయిజానికి పాల్పడుతున్న నాయకులకు ఆయన ముక్కుతాడు వేసేలా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  మల్కాజ్‌గిరిలో కొందరు నాయకులు తామేదో పెద్ద గూండాలమని, రౌడీలమని విర్రవీగుతున్నారని, అలాంటి వారి ఆటలు సాగనివ్వబోమని కేటీఆర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గులాబీ సైనికులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత భావోద్వేగంగా భరోసా ఇచ్చారు.  మల్కాజ్‌గిరి గడ్డపై రౌడీయిజం ప్రదర్శిస్తున్న నాయకుడికి గట్టి కౌంటర్ ఇస్తూ, నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా వందల సంఖ్యలో ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానికంగా ఏ రౌడీ వచ్చినా కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తానే స్వయంగా మల్కాజ్‌గిరికి వస్తానని హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఏ చిన్న అక్రమ కేసు పెట్టినా, తానే స్వయంగా ముందుండి వారిని విడిపించుకుంటానని క్యాడర్‌లో కొత్త జోష్ నింపారు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అధికార బలంతో వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. ఈ పోరాటంలో పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క కార్యకర్తకు కొండంత అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇదే వేదికపై నుంచి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల జడివాన కురిపించారు. అడ్డగోలు మాటలు చెప్పి, నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కేవలం 100 రోజుల్లోనే ప్రతిష్టాత్మకమైన 420 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠం దక్కించుకుని నేటికి ఏకంగా 900 రోజులు దాటిపోయిందని కీలక గణాంకాలను బయటపెట్టారు.  100 రోజుల గడువు కాస్తా 900 రోజులు దాటినా, ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలు ఊసే లేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 420 గ్యారంటీల అమలు ఇంకెప్పుడు చేస్తారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రులను కేటీఆర్ నిలదీశారు.  ఈ అన్యాయమైన పాలనపై కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. 
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తున్నది.  గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై  చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం కూటమి సిద్ధమైందని అంటున్నారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై  పూర్తిస్థాయిలో ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంతో గుడివాడ రాజకీయాలతో పాటు ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ హీట్  పెరిగింది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత  వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో  ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.  నిజానికి కొడాలి నానిపై కేవలం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసు మాత్రమే కాదు..  ఆర్థిక, శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి.  గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గుడివాడ పరిధిలోనే సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తరలించారని, జగనన్న కాలనీల భూములను లెవెల్  చేసే ప్రక్రియలో కొందరు స్థానిక యువకుల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను వాడుకుని భారీగా నిధుల బదిలీ  జరిగిందని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.   మట్టి కుంభకోణంలోనూ, అలాగే..  గతంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై జరిగిన   దాడుల కేసుల్లోనూ కొడాలి నానికి నేరుగా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆయా కేసుల్లో కొందరిని అరెస్టు కూడా అయ్యారు. కాగా..  అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. దీనితో పాటు మట్టి తవ్వకాలు, గుడివాడ తెలుగుదేశం కార్యాలయం దగ్ధం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై దాడి కేసులలో కూడా నానిని విచారించి.. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రాసిక్యూషన్ ప్రక్రియ ద్వారా ఆయనపై నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.  
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా?  ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే.. బరువు పెరగడానికి అసలు కారణం.. డాక్టర్ల ప్రకారం..  బరువు పెరగడం లేదా తగ్గడం అనేది  తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా  రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.  అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు. అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి శక్తిని అందిస్తాయి.  రాత్రి భోజనం చేసేటప్పుడు,  శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల,  ఎక్కువగా అన్నం తిని,  రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. బియ్యం రకం ముఖ్యం.. అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు.  తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.  అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం.. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి  జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి. సమతుల్యం ఉంటేనే.. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు.  క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,  రోజువారీ కేలరీలను  గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల  బరువు పెరగడం అనేది జరగదు.  బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా  తినే ఆహారం పరిమాణం, ఆహార రకం ,  మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.                            *రూపశ్రీ.
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి. వయసు కారణంగా, లేదా అలసిపోవడం వల్ల జరుగుతోందేమోనని, పరిసరాల కారణంగా సరిగా వినిపించడం లేదేమోనని ఇలా.. రకాలుగా అనుకుంటూ   వినికిడి సమస్యను లైట్ తీసుకుంటారు. చాలామంది ఇతరులతో  మాట్లాడటం కష్టమయ్యే వరకు తమ సమస్యను గుర్తించరు. కానీ వినికిడి సమస్య రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఆ లక్షణాలేంటో తెలుసుకోవడం వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వినికిడి సమస్యను మొదట్లోనే  గుర్తించడం ఎందుకు ముఖ్యం? వయసు పెరగడంతో వచ్చే వినికిడి లోపం క్రమంగా అభివృద్ధి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది.  దీని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలికంగా వినికిడిని , జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. చుట్టూ ఉన్న అందరూ ఎంతో బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే.. వినికిడి సమస్య ఉన్నవారు మాత్రం తమ సమస్య కారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోవడం, తమ రోజు వారీ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటివి జరుగుతాయి.  దీని వల్ల వినికిడి సమస్యను ముందుగానే గుర్తించడం ముఖ్యం. లక్షణాలు.. గందరగోళం.. వినికిడి లోపానికి మొదటి లక్షణం వినిపించకపోవడమే కాదు.. . కొన్నిసార్లు ఇతరులు మాట్లాడటం వినగలుగుతారు, కానీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లలో మాట్లాడే మాటలను  అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.  ఇది ప్రారంభ దశలో వినికిడి లోపానికి ఒక సాధారణ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పించుకోవాల్సి రావడం..  ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నట్లయితే, ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మొదట్లో ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఈ అలవాటు రోజువారీ లైఫ్ స్టైల్ లో  భాగంగా మారినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఈ మార్పును మొదటగా గమనిస్తారు. వ్యాల్యూమ్.. టీవీ, మొబైల్ ఫోన్ లేదా రేడియో వాల్యూమ్‌ను నిరంతరం పెంచడం మరో సాధారణ లక్షణం. తరచుగా, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆ వాల్యూమ్‌ను చాలా ఎక్కువగా అని చెబుతూ ఉంటారు, అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తి దానిని సాధారణంగానే అనుకుంటారు. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది, కాబట్టి చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఫోన్లో  మాట్లాడటంలో ఇబ్బంది.. ఫోన్‌లో మాట్లాడటంలో ఇబ్బంది కూడా వినికిడి లోపానికి ఒక సంకేతం కావచ్చు. నేరుగా, ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు  ముఖ కవళికలు , పెదవుల కదలికలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ఫోన్‌లో కేవలం  గొంతుపైనే ఆధారపడవలసి ఉంటుంది. స్వల్ప వినికిడి లోపం కూడా  ఫోన్ లో మాట్లాడటం కుదరకపోతే అది స్పష్టంగా తెలిసిపోతుంది. చెవిలో శబ్దాలు.. చెవుల్లో నిరంతరం రింగింగ్, గింగురుమనే లేదా ఈల శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం. టిన్నిటస్ అని పిలువబడే ఈ పరిస్థితి, తరచుగా వినికిడిలో ఒక అంతర్లీన సమస్యను సూచిస్తుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కేవలం చెవులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా ఇది సామాజిక ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి , కుంగుబాటుకు కూడా దారితీయవచ్చు. అందువల్ల, ఈ లక్షణాలు కొనసాగితే ఈ.ఎన్.టి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.                                            *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.